వడ్లు కొనుగోలు చేయండి.. లేదంటే, సీఎం పదవి నుంచి త‌ప్పుకోండి..

KCR doing Deeksha for political gains, laments Bandi Sanjay. బీజేపీ రాష్ట్ర చీఫ్ బండి సంజయ్ సోమవారం టీఆర్ఎస్ పార్టీపైనా, నేతలపైనా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

By Medi Samrat  Published on  11 April 2022 10:34 AM GMT
వడ్లు కొనుగోలు చేయండి.. లేదంటే, సీఎం పదవి నుంచి త‌ప్పుకోండి..

బీజేపీ రాష్ట్ర చీఫ్ బండి సంజయ్ సోమవారం టీఆర్ఎస్ పార్టీపైనా, నేతలపైనా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు తన రాజకీయ ప్రయోజనాల కోసమే.. దేశ రాజధానిలో దీక్ష చేస్తున్నారని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. వరిధాన్యం కొనుగోలు చేయకుండా, కేంద్ర ప్రభుత్వాన్ని నిందిస్తూ రైతులను సీఎం కేసీఆర్ మోసం చేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో వరిసాగుపై నివేదిక పంపాలని సీఎం కేసీఆర్‌ను కేంద్ర ప్రభుత్వం కోరింద‌ని అన్నారు. దానిని అమలు చేయడంలో కేసీఆర్ ప్ర‌భుత్వం విఫలమైందని మండిపడ్డారు. సీఎం కేసీఆర్‌కు దమ్ముంటే రైతుల నుంచి వడ్లు కొనుగోలు చేయాలని, లేదంటే సీఎం పదవి నుంచి దిగిపోవాలన్నారు.

ఢిల్లీలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపట్టిన దీక్షకు కౌంటర్‌గా హైదరాబాద్‌లోని ఇంద్రాపార్క్‌ వద్ద బీజేపీ ఆధ్వర్యంలో భారీ దీక్ష చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను తెరిచి వరిధాన్యం కొనుగోలు చేయడం ప్రారంభించాలని, లేదంటే వెనక్కి తగ్గాలని తెలంగాణ రాష్ట్ర బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఒక రోజు దీక్షను నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఢిల్లీలో సోమవారం టిఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపైనా, రాష్ట్ర రైతుల నుంచి వరి ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా నిరాకరిస్తున్నారంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఢిల్లీలో జరిగిన టీఆర్‌ఎస్‌ దీక్షలో పాల్గొని ప్రసంగించారు.Next Story
Share it