ప్రముఖ వాగ్గేయకారుడు, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న కుమార్తె వివాహం ఇవాళ హైదరాబాదులో జరిగింది. ఈ వివాహానికి సీఎం కేసీఆర్ విచ్చేసి వధూవరులను ఆశీర్వదించారు. కేసీఆర్ రాకతో పెళ్లివేడుకలో మరింత సందడి పెరిగింది. ఇక, ఈ పెళ్లికి మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత కూడా వచ్చారు. అలాగే మంత్రులు నిరంజన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, జగదీశ్ రెడ్డి తదితరులు కూడా హాజరయ్యారు. గోరటి మిత్రుడు, సినీ నటుడు ఆర్.నారాయణమూర్తి సైతం పెళ్లిలో కనిపించారు. ప్రజాగాయకుడు గోరేటి వెంకన్నకు ఇటీవలే సీఎం కేసీఆర్ ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చారు. గవర్నర్ కోటాలో ఆయన ఎమ్మెల్సీ అయ్యారు.