57 ఏళ్ల‌కు వృద్ధాప్య పెన్షన్.. అమలు ప్రక్రియను ప్రారంభించండి

KCR announces old-age pension for those above 57 years from August. వృద్ధాప్య ఫెన్షన్లకు అర్హతను 57 సంవత్సరాలకు తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయించింది.

By Medi Samrat  Published on  1 Aug 2021 4:23 PM GMT
57 ఏళ్ల‌కు వృద్ధాప్య పెన్షన్.. అమలు ప్రక్రియను ప్రారంభించండి

వృద్ధాప్య ఫెన్షన్లకు అర్హతను 57 సంవత్సరాలకు తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో అందుకు సంబంధించిన ప్రక్రియను తక్షణమే ప్రారంభించాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఈ నిర్ణయంతో మరో 6,62,000 కొత్త పించన్లు పెరగనున్నాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం పించన్ల సంఖ్య 58 లక్షలకు చేరుకోనున్నది. కుటుంబంలో ఒక్కరికే ఫించను పద్దతిని కొనసాగిస్తూ.. భర్త చనిపోతే భార్యకు.. భార్య చనిపోతే భర్తకు వెంటనే పెన్షన్ బదిలీ చేయాలని.. ఈ ప్రక్రియను తక్షణమే ప్రారంభించాలని సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. అలాగే.. దోభీ గాట్లకు, సెలూన్లకు 250 యూనిట్ల ఫ్రీ కరెంట్ ఇవ్వాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వారంలోగా సంపూర్ణంగా అమలు చేయాలని సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు.


Next Story