తెలంగాణలో సంచలనం సృష్టించిన న్యాయవాద దంపతుల హత్య కేసు దురదృష్టకరమని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. ఈ ఘటనలో ఇప్పటికే ఆరుగురిని అరెస్టు చేశారని వెల్లడించారు. పోలీసులు నిపక్షపాతంగా కేసును ఛేదిస్తున్నారని తెలిపారు. నిందుతులు ఎంతటివారైనా శిక్షనుంచి తప్పించుకోలేరని సీఎం స్పష్టం చేశారు.
న్యాయవాద దంపతుల హత్యకు టి. ఆర్. ఎస్ కి సంబంధంలేదని కేసీఆర్ వెల్లడించారు. నిందితుడిగా ఉన్న టి.ఆర్.ఎస్ నేతను పార్టీ నుంచి అప్పటికప్పుడే తొలగించామని... వెంటనే అతను అరెస్టు కూడా అయ్యారని ముఖ్యమంత్రి తెలిపారు.
కొత్త సాగు చట్టాలపై అసెంబ్లీలో చర్చించాలని ప్రభుత్వాన్ని కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత భట్టి విక్రమార్క కోరారు. రైతుల సమస్యలపై మాట్లాడుతుండగా... సీఎం కేసీఆర్ ఈ విషయంలో జోక్యం చేసుకున్నారు. ఆ చట్టాలపై మాట్లడే పరిధి లేదని ముఖ్యమంత్రి అన్నారు. రాష్ట్ర విషయాలపై మాట్లాడాలని సూచించారు. ఈ నేపథ్యంలో భట్టి విక్రమార్క శాసనసభ సమావేశాల నుంచి వాకౌట్ చేశారు.