రవీంద్రభారతిలో బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఏర్పాటుపై కవిత కీలక వ్యాఖ్యలు
రవీంద్రభారతిలో దివంగత గాయకుడు బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఏర్పాటు వివాదంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత స్పందించారు.
By - Knakam Karthik |
రవీంద్రభారతిలో బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఏర్పాటుపై కవిత కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్: రవీంద్రభారతిలో దివంగత గాయకుడు బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఏర్పాటు వివాదంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత స్పందించారు. జయ జయహే గీతం పాడనని బాల సుబ్రమణ్యం గారు అన్నట్లు ఆరోపణ ఉంది. అందుకే ఆయన విగ్రహాం విషయంలో నేను తెలంగాణ వాదుల పక్షానే ఉంటా. రవీంద్రభారతి లో తెలంగాణ జానపద కళాకారుల విగ్రహాలు ఏర్పాటు చేయాలి. సినీ కళాకారుల విగ్రహాలను నేను వద్దు అనటం లేదు. కానీ వాటిని కోసం ఇతర ప్రాంతాలను ఎంచుకోవాలని సూచిస్తున్నా...అని కవిత పేర్కొన్నారు.
అశాస్త్రీయంగా హైదరాబాద్ డివిజన్లు విభజన
హైదరాబాద్ లేకుండా తెలంగాణ ఇస్తామంటే మనం ఊరుకోలేదు. పట్టు పట్టి మరీ హైదరాబాద్ తో ఉన్న తెలంగాణను సాధించుకున్నాం. హైదరాబాద్ గ్రోత్ ఇంజన్ గా 10 ఏళ్లు అభివృద్ధి జరిగింది. ఇంకా తెలంగాణలో అభివృద్ది కావాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. ఇప్పటికే కోటి మంది నివాసం ఉంటున్న సిటీలో మరో 27 మున్సిపాలిటీలను కలిపారు. కానీ దానికి తగిన విధంగా ప్రజా రవాణా సదుపాయం లేదు. గతంలో 7500 బస్సులుంటే ఇప్పుడు వాటిని 3500 బస్సులకు తగ్గించారు. సిటీలో ఎక్కడకు వెళ్లిన సరే బస్సుల సమస్య గురించే చెబుతున్నారు. బస్సులు తగ్గించటంతో వ్యక్తిగత వాహనాల సంఖ్య భారీగా పెరిగింది. రోడ్లు, ఫ్లై ఓవర్లు అనే హంగామా ఉన్న సరే ప్రజలకు ప్రజా రవాణా ఉండాలి. డల్లాస్, సింగపూర్ నగరం మాదిరిగా కావాలంటే ప్రజా రవాణా ఉండాలి. ఎలక్ట్రిక్ బస్సులను తీసుకొచ్చి ప్రైవేట్ వాళ్లకు అప్పగిస్తున్నారు. అంటే క్రమంగా ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రైవేట్ పరమైతే వాళ్ల ఇష్టమొచ్చినట్లు ధరలు పెంచేస్తారు. గతంలో ఓల్డ్ సిటీలో సెట్విన్ బస్సులు చిన్న గల్లీలకు కూడా పోయేవి. కానీ ఇప్పుడు పెద్ద గల్లీలకు కూడా బస్సులు లేని పరిస్థితి. వికలాంగులకు బస్ ఎక్కే సౌకర్యం లేకుండా పోయింది. వారికి ట్రాన్స్ పోర్ట్ సౌకర్యం కల్పించాలి. హైదరాబాద్ లో స్ట్రీట్ డాగ్స్ సమస్య చాలా పెరిగింది. మొన్న ఓ బాబుపై 20 కుక్కలు దాడి చేసి అతని చెవును కొరికాయి. చెత్త ఎక్కడ పడితే అక్కడ వేయటంతో కుక్కల సమస్య పెరిగింది. 2022 లో 92, 924 కేసులు నమోదైతే 2024 లో లక్షా 21 వేల కేసులు నమోదయ్యాయి. కుక్కల కోసం ఉన్న బడ్జెట్ ను సరిగా వినియోగించటం లేదు..అని కవిత పేర్కొన్నారు.
గంట కోసం రూ.10 కోట్లా?
సీఎం రేవంత్ రెడ్డి గంట ఎంటర్ టైన్ మెంట్ కోసం పది కోట్లు ఖర్చు చేశారు. ఈ ఫుట్ బాల్ మ్యాచ్ కారణంగా తెలంగాణకు వచ్చిన ప్రయోజనం ఏంటీ? సింగరేణి కార్మికుల సొమ్మును ఇందుకోసం వాడారు. కాంగ్రెస్ పార్టీ ఫండ్ నుంచి సింగరేణికి రూ.10 కోట్లు చెల్లించాలి, రాహుల్ గాంధీ చిక్కడపల్లి లైబ్రరీ కి రాకుండా మ్యాచ్ చూసేందుకు వస్తారా? హైదరాబాద్ లో డివిజన్ల ను అశాస్త్రీయంగా డివైడ్ చేశారు. హైదరాబాద్ నగరంలో ప్రజా రవాణా, డ్రైనేజీ, మంచినీటి సౌకర్యాలు కల్పించలేకపోతున్నారు. సిటీ పర్యటనలో చాలా సమస్యలు మా దృష్టికి వచ్చాయి. వాటి పరిష్కారం కోసం నిరంతరం జాగృతి పోరాటం చేస్తూనే ఉంటుంది. గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఈ విధంగా ఖర్చు చేసి ఉంటే దానిపై కూడా సమాధానం చెప్పాలి.