ఢిల్లీ మద్యం పాలసీ కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యుడీషియల్ కస్టడీని ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు జూలై 7 వరకు పొడిగించింది. శుక్రవారంతో ఆమె కస్టడీ ముగియడంతో ఆమెను సీబీఐ కేసుల ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆమె కస్టడీని పొడిగించింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మనీలాండరింగ్ జరిగిందనే ఆరోపణలపై కవితను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేసింది. మార్చి నుండి ఆమె తీహార్ జైలులోనే ఉన్నారు. అనంతరం క్రైమ్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ఆమెను అదుపులోకి తీసుకుంది.
ఇక వచ్చే మంగళవారం వరకూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జైలులోనే ఉండనున్నారు. మద్యం పాలసీ కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు చేస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై ఈడీ పిటిషన్‌పై తీర్పు వెలువడే వరకు మధ్యంతర స్టే విధిస్తూ ఢిల్లీ హైకోర్టు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రస్తుతానికి తీహార్ జైల్లోనే ఉండనున్నారు.