టీడీపీకి కాసాని జ్ఞానేశ్వర్ రాజీనామా

కాసాని జ్ఞానేశ్వర్ తెలంగాణ‌ టీడీపీ చీఫ్ ప‌ద‌వికి రాజీనామా చేశారు. ఈ సంద‌ర్భంగా అధినేత చంద్ర‌బాబుపై

By Medi Samrat  Published on  30 Oct 2023 8:47 PM IST
టీడీపీకి కాసాని జ్ఞానేశ్వర్ రాజీనామా

కాసాని జ్ఞానేశ్వర్ తెలంగాణ‌ టీడీపీ చీఫ్ ప‌ద‌వికి రాజీనామా చేశారు. ఈ సంద‌ర్భంగా అధినేత చంద్ర‌బాబుపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు కోరితే ఖమ్మం మీటింగ్ పెట్టానని అన్నారు. తర్వాత నిజామాబాద్ లో కూడా మీటింగ్ పెట్టాలని అన్నార‌ని వెల్ల‌డించారు. ఇంటింటికీ టీడీపీ అని, 41వ ఆవిర్భావ సభ అని పెట్టించారని పేర్కొన్నారు.

చంద్రబాబును జైల్లో కలిసి వచ్చాన‌ని తెలిపారు. లోకేష్ కు ఫోన్ చేస్తే కూడా లిఫ్ట్ చేయలేదని అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. అభ్యర్థులు సొంత డబ్బులు పెట్టుకునే వాళ్ళే నిలబడాలని నిర్ణయం తీసుకున్నామ‌ని వెల్ల‌డించారు. అయితే చంద్రబాబు ఎన్నికల్లో నిలబడటం లేదని చెప్పారు.. నన్ను ఎందుకు పార్టీలో పిలిచారు అని చంద్రబాబును అడిగానని వివ‌రించారు.

60 మంది అభ్యర్థులు తయారయి ఉన్నారని.. క్యాడర్‌కు పార్టీలో ఉండి న్యాయం చేయలేనన్నారు. టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్ర‌క‌టించారు. రేపు నా క్యాడర్ ను పిలిచి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాన‌ని తెలిపారు. ఎందుకు అభ్యర్థులు పోటీ చేయట్లేదు అనేది చంద్రబాబు చెప్పడం లేదన్నారు.

లోకేష్ చిన్నపిల్లాడిలా మాట్లాడుతున్నారని అన్నారు. ఇక్కడ ఎం జరుగుతుందో ఆయనకు పట్టింపు లేదన్నారు. ఆంధ్రలో టీడీపీ జనసేనతో పొత్తు.. తెలంగాణ లో జనసేన, బీజేపీ పొత్తు.. ఇదేం బొమ్మలాట? అని ప్ర‌శ్నించారు. లోకేష్ ఏం మాట్లాడతాడో లోకేష్‌కే తెలియాలని ఎద్దేవా చేశారు. తెలంగాణతో సంబంధం లేదు అని.. లోకేష్ అన్నాడట.. బాలకృష్ణ కూడా ఎన్టీఆర్ భవన్ కి వచ్చారు.. తడాఖా చూపిద్దాం అన్నారు.. ఇప్పుడు బాలయ్య కూడా పట్టించుకోవడం లేదు.. ఫోన్‌ లిఫ్ట్ చెయ్యడం లేదు.. చిల్లిగవ్వ కూడా పార్టీ నుంచి తీసుకోలేదు.. అన్నిటికీ నేనే ఖర్చు చేశాన‌ని కాసాని జ్ఞానేశ్వర్ వాపోయారు.

Next Story