సంతోష్‌రావు టార్గెట్‌గా మరోసారి కవిత సంచలన కామెంట్స్..!
బీఆర్ఎస్ మాజీ ఎంపీ సంతోష్‌రావు టార్గెట్‌గా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు
By - Knakam Karthik |
సంతోష్‌రావు టార్గెట్‌గా మరోసారి కవిత సంచలన కామెంట్స్
హైదరాబాద్: బీఆర్ఎస్ మాజీ ఎంపీ సంతోష్‌రావు టార్గెట్‌గా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్‌రెడ్డికి ప్రధాన గూఢచారి సంతోష్‌రావే అని హాట్ కామెంట్స్ చేశారు. నిజామాబాద్‌లో గంజాయి ముఠా దాడిలో తీవ్రంగా గాయపడిన ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్యను నిమ్స్ హాస్పిటల్‌లో కవిత పరామర్శించారు. సౌమ్య కుటుంబానికి అండగా ఉంటామని కవిత హామీ ఇచ్చారు. అనంతరం కవిత మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ తినే ఇడ్లీ సమాచారాన్ని కూడా రేవంత్‌రెడ్డికి చేరవేసే వ్యక్తి అని కామెంట్స్ చేశారు. తన గూఢచారికి శిక్షపడకుండా రేవంత్ రెడ్డి కాపాడుకునే పరిస్థితి ఉందని కవిత విమర్శించారు.
కేసీఆర్‌కు ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాలను దూరం చేసిన దుర్మార్గుడు సంతోష్ రావు..అని కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలీసులు నిజాయితీగా పని చేస్తే సంతోష్‌రావుకు కచ్చితంగా శిక్ష పడుతుందని కవిత పేర్కొన్నారు. నేను చెప్పిన దయ్యాల్లో మొదటి దెయ్యం సంతోష్ రావే అని కవిత ఎద్దేవా చేశారు. సంతోష్‌రావుకు హరీశ్‌రావు, కేటీఆర్‌లు ఎందుకు వత్తాసు పలుకుతున్నారో అర్థం కావడంలేదని కవిత విమర్శించారు.
గంజాయి, డ్రగ్స్ ముఠాలకు తగిన గుణపాఠం చెప్పాలి
ఒక ఎక్సైజ్ కానిస్టేబుల్‌ను చంపే ధైర్యం గంజాయి బ్యాచ్ చేసిందంటే ప్రభుత్వం అంటే వారికి ఏ మాత్రం భయం లేదని స్పష్టమవుతోందని కవిత వ్యాఖ్యానించారు. డ్రగ్స్, గంజాయి రహితం చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. దురదృష్టం ఏంటంటే గంజాయి, డ్రగ్స్ గ్రామాల్లో ఉచితంగా దొరికే పరిస్థితి వచ్చిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. స్కూళ్లలోకి కూడా గంజాయి, డ్రగ్స్ తీసుకొచ్చి పిల్లలను పాడు చేస్తున్నారని దీని కారణంగా ఆడవాళ్లే బాధితులుగా మారే పరిస్థితి ఉంటుందని కవిత వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం డ్రగ్స్, గంజాయి మాఫియాపై వారి ప్రతాపం చూపాలని కవిత డిమాండ్ చేశారు.