కల్వకుంట్ల కవిత అరెస్ట్

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్ అయ్యారు.

By -  Medi Samrat
Published on : 19 Nov 2025 6:08 PM IST

కల్వకుంట్ల కవిత అరెస్ట్

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్ అయ్యారు. బుధవారం నాంపల్లిలోని సింగరేణి భవన్‌ను తెలంగాణ జాగృతి నేతలు, హెచ్ఎంఎస్ కార్యకర్తలు కలిసి ముట్టడించారు. ఈ సందర్భంగా కార్యకర్తలతో కలిసి ఆటోలో కవిత చేరుకున్నారు. డిపెండెంట్ ఉద్యోగాలను పునరుద్ధరించాలని మెడికల్ బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అయితే అక్కడ తోపులాట జరిగింది. కవిత సహా పలువురు నేతలను పోలీసులు అరెస్ట్ చేసి నాంపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. తెలంగాణలోని బొగ్గు బ్లాకుల వేలాన్ని వెంటనే నిలిపివేయాలని కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. కొత్త బ్లాకులను కేవలం సింగరేణికి మాత్రమే కేటాయించాలన్నారు.

Next Story