కాళోజీ జీవితం స్ఫూర్తిదాయకం..అన్ని వేళలా ఆదర్శం: కేసీఆర్

ధిక్కారమే జీవితంగా గడిపిన కాళోజీ జీవితం స్ఫూర్తిదాయకం అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలిపారు.

By Knakam Karthik
Published on : 9 Sept 2025 10:24 AM IST

Telangana, Kaloji Narayanarao Jayanthi, Kcr, Brs

కాళోజీ జీవితం స్ఫూర్తిదాయకం..అన్ని వేళలా ఆదర్శం: కేసీఆర్

ధిక్కారమే జీవితంగా గడిపిన కాళోజీ జీవితం స్ఫూర్తిదాయకం అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలిపారు. పద్మ విభూషణ్, ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా వారి కృషిని కేసీఆర్ స్మరించుకున్నారు. తెలంగాణ స్వరాష్ట్ర సాధన ఉద్యమంలో కాళోజీ సాహిత్యం ఎంతో స్ఫూర్తిని నింపిందని వారితో తనకున్న అనుబంధాన్ని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు.

కాళోజీ జన్మదినాన్ని తెలంగాణ భాషా దినోత్సవంగా అమలుచేసి, తెలంగాణ భాష, సాహిత్యాలలో విశేషంగా కృషి చేసిన కవులు రచయితలకు కాళోజీ పేరుతో పురస్కారాన్ని అందిస్తూ గౌరవించుకునే గొప్ప సంప్రదాయాన్ని నాటి బి ఆర్ ఎస్ ప్రభుత్వం నెలకొల్పిందని కేసీఆర్ అన్నారు. రాష్ట్ర వైద్య విశ్వవిద్యాలయానికి కాళోజీ పేరు పెట్టుకున్నామని,. వరంగల్లో కాళోజీ కళాకేంద్రంను ఏర్పాటు చేశామని తెలిపారు. తన పుట్టక నుంచి చావు దాకా జీవితమంతా తెలంగాణనే శ్వాసించిన కాళోజీ సాహిత్యం అన్ని వేళలా ఆదర్శం అని కేసీఆర్ అన్నారు.

Next Story