నేను పార్టీ మారుతున్నానంటే బీఆర్ఎస్‌కు భయం ఎందుకు.? : కడియం శ్రీహరి
నేను పార్టీ మారుతున్నానంటే బీఆర్ఎస్ పార్టీకి భయం ఎందుకు అని స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రశ్నించారు.
By Medi Samrat Published on 30 March 2024 2:36 PM ISTనేను పార్టీ మారుతున్నానంటే బీఆర్ఎస్ పార్టీకి భయం ఎందుకు అని స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రశ్నించారు. కార్యకర్తలతో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పసునూరి దయాకర్, ఆరూరి రమేష్ పార్టీ మారితే లేని అభ్యంతరం నా విషయంలో బీఆర్ఎస్ కు అభ్యంతరం ఎందుకు అని ప్రశ్నించారు. నా రాజకీయ జీవితంలో నాపై ఒక్క అవినీతి ఆరోపణ లేదు.. నాపై ఒక్క పిట్టి కేసు లేదు.. ఇప్పుడు నాపై మాట్లాడుతున్న నేతలపై అధికారం పోగానే ఎందుకు డజన్ల కొద్ది కేసులు అవుతున్నాయని అడిగారు.
నాకు 70 ఏళ్లు దాటాయి.. నా రాజకీయ జీవితం ప్రజాసేవకే అంకితం చేశాను. నా జీవితంలో ఒక్క అవినీతి మరకలేదు. కాంగ్రెస్ నేతలే నా వద్దకు వచ్చి పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. నా కుమార్తె కడియం కావ్యకు ఎంపీ టిక్కెట్ ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని తెలిపారు.
ఉద్యమ కారులకు కేసీఆర్ చేసింది ఏం లేదని కార్యకర్తలు తనతో అన్నారని పేర్కొన్నారు. ఒక్కరోజు కేసీఆర్, కేటీఆర్ ఉద్యమకారులను దగ్గరికి రానివ్వలేదన్నారు. నేను కాంగ్రెస్ లోకి వెళితే నాకు వచ్చిన అవకాశాన్ని నియోజకవర్గ అభివృద్ధి కోసం ఉపయోగిస్తానని తెలిపారు. మన జిల్లాల్లో పక్కనున్న పాలకుర్తి, జనగామ నియోజకవర్గాల్లో ఎలా అభివృద్ధి జరిగింది. ఒక్క స్టేషన్ ఘన్ పూర్ మాత్రమే ఎందుకు ఎందుకు వెనుకపడింది అని కడియం శ్రీహరి ప్రశ్నించారు. నాకు వచ్చిన అవకాశాన్ని స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గ అభివృద్ధి కోసం వినియోగిస్తానని అన్నారు. నాకోసం పదవులు పణంగా పెట్టి వస్తున్న ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎంపీపీలు అందర్నీ కాపాడుకుంటానన్నారు. పాత కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తలు అందరిని కలుపుకొని ముందుకు వెళ్తానన్నారు.