కాళేశ్వరంపై దృష్టి పెట్టిన కేఏ పాల్

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ వైజాగ్ స్టీల్ పై పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో అవినీతి జరిగిందంటూ పోరాటాన్ని మొదలు పెట్టారు

By Medi Samrat  Published on  15 April 2024 7:30 PM IST
కాళేశ్వరంపై దృష్టి పెట్టిన కేఏ పాల్

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ వైజాగ్ స్టీల్ పై పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో అవినీతి జరిగిందంటూ పోరాటాన్ని మొదలు పెట్టారు. ఇండియాలోనే అతిపెద్ద స్కామ్ కాళేశ్వరం ప్రాజెక్ట్ అని.. దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని సీబీఐకి పాల్ ఫిర్యాదు చేశారు. కోఠీలోని సీబీఐ కార్యాలయంలో డీజీకి ఆయన ఫిర్యాదు అందించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో రూ. 50 వేల కోట్ల అవినీతి జరిగిందని సీబీఐకి ఫిర్యాదు చేశామని.. తెలంగాణ హైకోర్టులో దీనికి సంబంధించిన నివేదిక ఉందని, అయినప్పటికీ సీబీఐ విచారణకు ఆదేశించలేదని పాల్ చెప్పుకొచ్చారు. ఎన్నికల సమయంలో కాళేశ్వంలో జరిగిన అవినీతి గురించి ప్రశ్నించిన సీఎం రేవంత్, ఇప్పుడు కనీసం మాట్లాడటం లేదని అన్నారు. ఈ అవినీతిపై సీబీఐ విచారణ జరిపించాలని కోరుతూ హైకోర్టు చీఫ్ జస్టిస్ కు రేవంత్ లేఖ రాయాలని డిమాండ్ చేశారు.

ఇక ప్రజాశాంతి పార్టీకి ఎన్నికల కమిషన్‌ కొత్త గుర్తు కేటాయించింది. రాబోయే ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీకి హెలికాప్టర్‌ గుర్తు కాకుండా.. మట్టికుండ గుర్తును కేటాయించింది. తమకు కుండ గుర్తు ఇచ్చిన ఈసీకి, ఆ గుర్తు ఇవ్వాలని ఆదేశించిన ఏపీ, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులకు పాల్ ధన్యవాదాలు తెలిపారు.

Next Story