రైతుబంధు నిధుల పంపిణీకి అనుమతి ఇచ్చిన ఈసీ.. ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ విషయమై బీఆర్ఎస్ సీనియర్ నేత, ఎంపీ కే కేశవరావు మాట్లాడుతూ.. ఇదీ పార్టీలకు సంబంధించినది కాదు.. రైతులకు సంబంధించినది.. అన్నీ పార్టీలు సహకరించాలన్నారు. రైతు బంధుకు అనుమతి ఇచ్చి.. ఇప్పుడు వెనక్కి తీసుకోవడం వల్ల 4 కోట్ల మంది ప్రజలు సఫర్ అవుతున్నారని.. ఈ అంశాన్ని పరిశీలించాలని ఈసీని కోరామని తెలిపారు. .
రైతు బంధుపై మంత్రులు మాట్లాడితే వాళ్లకు నోటీసులు ఇవ్వండి.. రైతు బంధును ఎలా ఆపుతారని ప్రశ్నించారు. రైతు బంధు ఆన్ గోయింగ్ స్కీం.. ఎలాంటి నోటీసు ఇవ్వకుండా ఎలా అపుతారని ప్రశ్నించారు. రాజకీయనేతల్లో ఉన్న కోపతాపాలను రైతుల మీద రుద్దకూడదన్నారు. రైతు బంధును కాంగ్రెస్ వాళ్లు ఆపారని నేను అనడం లేదు.. ఈసీఐతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. కోర్టుకు వెళ్లేందుకు టైమ్ లేదని.. రేపటి వరకు విత్ డ్రా చేపించే ప్రయత్నం మేము చేస్తాం.. లేదంటే రైతులు అర్థం చేసుకోవాలి.. రెండు, మూడు రోజులు ఓపిక పట్టాలని కోరారు.