భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) నుండి కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి వచ్చారు కె.కేశవ రావు. ఆయనకు కాంగ్రెస్ పార్టీ కీలక బాధ్యతలు అప్పగించింది. ఆయనకు క్యాబినెట్ హోదాతో తెలంగాణ ప్రభుత్వ ప్రజా వ్యవహారాల సలహాదారుగా నియమితులయ్యారు. గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి శనివారం నాడు నోటిఫికేషన్ జారీ చేశారు.
కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత కేశవ రావు తన రాజ్యసభ ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఏపీసీసీ మాజీ అధ్యక్షుడు కేశవ రావు బుధవారం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, పార్టీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో తిరిగి కాంగ్రెస్‌లో చేరారు. 2013లో కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్‌ఎస్ లో చేరడానికి ముందు కాంగ్రెస్ పార్టీలోనే కేశవరావు ఉన్న సంగతి తెలిసిందే. ఆయన కుమార్తె, జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి మార్చి 30న బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు.