అన్నా..ఆ దేవుడే మళ్లీ నీ దగ్గరికి పంపాడు..కేసీఆర్‌ను కలిసి ఎమోషనల్ అయిన జీవన్‌రెడ్డి (video)

ఎర్రవల్లిలోని కేసీఆర్ నివాసంలో మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గులాబీ బాస్‌ను కలిశారు.

By -  Knakam Karthik
Published on : 10 April 2026 3:59 PM IST

Telangana, JeevanReddy, KCR, BRS, Erravelli, Telangana Politics

అన్నా..ఆ దేవుడే మళ్లీ నీ దగ్గరికి పంపాడు..కేసీఆర్‌ను కలిసి ఎమోషనల్ అయిన జీవన్‌రెడ్డి (video)

ఎర్రవల్లిలోని కేసీఆర్ నివాసంలో మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గులాబీ బాస్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఆయన కేసీఆర్‌తో తన పాత అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ అత్యంత భావోద్వేగంగా మాట్లాడారు. "అన్నా.. నీతో కలిసి పనిచేసేందుకు ఆ దేవుడే నన్ను మళ్ళీ నీ దగ్గరకు పంపాడు. చాలా కాలం తర్వాత మళ్ళీ నీ నాయకత్వంలో పనిచేసే అవకాశం రావడం నాకెంతో సంతోషంగా ఉంది" అంటూ తన మనసులోని మాటను బయటపెట్టారు. గత కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్న జీవన్ రెడ్డి, మళ్ళీ కేసీఆర్ గూటికి చేరడం బీఆర్ఎస్ శ్రేణుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. పార్టీ పటిష్టత కోసం తన వంతు కృషి చేస్తానని, కేసీఆర్ సూచనల మేరకు ముందుకు సాగుతానని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

Next Story