తెలంగాణలో పోటీ చేసే స్థానాల‌ను ప్ర‌క‌టించిన‌ జ‌న‌సేన‌

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మరో పార్టీ తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. తెలంగాణలో 32 నియోజకవర్గాల్లో

By Medi Samrat  Published on  2 Oct 2023 9:09 PM IST
తెలంగాణలో పోటీ చేసే స్థానాల‌ను ప్ర‌క‌టించిన‌ జ‌న‌సేన‌

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మరో పార్టీ తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. తెలంగాణలో 32 నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నట్టు జనసేన పార్టీ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ఆయా స్థానాల జాబితా విడుదల చేసింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 9 స్థానాల్లో పోటీ చేస్తోంది జనసేన. కూకట్‌పల్లి, ఎల్బీనగర్‌, వైరా, ఖమ్మం, నాగర్‌కర్నూల్‌, మునుగోడు, కుత్బుల్లాపూర్‌, శేర్‌లింగంపల్లి, పటాన్‌చెరు, సనత్‌నగర్‌, కొత్తగూడెం, ఉప్పల్‌, అశ్వరావుపేట, పాలకుర్తి, నర్సంపేట, స్టేషన్‌ ఘన్‌పూర్‌, హుస్నాబాద్‌, రామగుండం, జగిత్యాల, నకిరేకల్‌, హుజూర్‌నగర్‌, మంథని, కోదాడ, సత్తుపల్లి, వరంగల్‌ వెస్ట్‌, వరంగల్‌ ఈస్ట్‌, ఖానాపూర్, మల్కాజిగిరి, మేడ్చల్‌, పాలేరు, ఇల్లందు, మధిరలో జనసేన పోటీ చేస్తోంది. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షను నెరవేర్చడమే జనసేన లక్ష్యమని పార్టీ హైకమాండ్ ఓ ప్రకటనలో జనసేన పార్టీ తెలిపింది.

32 నియోజకవర్గాల్లో పార్టీని ప్రజల్లోకి తీసుకు వెళ్తున్నామని.. పార్టీ బలంగా ఉన్న స్థానాల్లో పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర చేయబోతున్నారని జనసేన పార్టీ ఉపాధ్యక్షుడు బొంగునూరి మహేందర్‌ రెడ్డి తెలిపారు. అయితే ఇది ఫస్ట్ లిస్ట్ మాత్రమేనా.. ఇంకా ఏమైనా లిస్టులు ఉన్నాయేమో తెలియాల్సి ఉంది.

Next Story