జ‌గ‌న్ అంటే పిచ్చి.. బాడీ పెయింటింగ్ వేయించుకున్న తెలంగాణ యువకుడు.. వీడియో వైర‌ల్‌

Jagan Fan Lakshman Naik Body Painting. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి అంటే అభిమానం ఉన్న వాళ్లు

By Medi Samrat
Published on : 21 Dec 2020 2:37 PM IST

జ‌గ‌న్ అంటే పిచ్చి.. బాడీ పెయింటింగ్ వేయించుకున్న తెలంగాణ యువకుడు.. వీడియో వైర‌ల్‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి అంటే అభిమానం ఉన్న వాళ్లు చాలా మందే ఉన్నారు. ఈ రోజు ఆయ‌న పుట్టిన రోజు సంద‌ర్భంగా శుభాకాంక్ష‌లు వెల్లువెత్తాయి. సెల‌బ్రెటీల నుంచి సామాన్యుల వ‌ర‌కు ఆయ‌నకు విషెస్ చెప్పారు. అయితే.. తెలంగాణ‌కు చెందిన ఓ యువ‌డ‌కు మాత్రం వెరైటీగా బ‌ర్త్‌డే విషెస్ చెప్పాడు.



పేరు లక్ష్మణ్ నాయక్. ఊరు తెలంగాణ రాష్ట్రంలోని దేవరకొండ. వైఎస్ఆర్ అన్నా, జగన్ అన్నా చెప్పలేనంత అభిమానం. అందుకే జగన్ పుట్టినరోజు సందర్భంగా ఇలా ఒళ్లంతా బాడీ పెయింట్ వేయించుకున్నారు. హ్యాపీ బర్త్ డే జగన్ అంటూ అక్షరాలు రాయించుకున్నాడు. వీపుపై వైఎస్ఆర్ అనే అక్షరాలు రాయించుకుని తన అభిమానాన్ని ఇలా చాటుకున్నారు. జగన్ తో కలసి ఓ సెల్ఫీ దిగాలని అదని కోరిక అట. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. మ‌రీ చూడాలి అత‌డి క‌లను జ‌గ‌న్ నెర‌వేరుస్తాడో లేదో


Next Story