వరుస సోదాలు.. తెలంగాణలో టెన్షన్.. టెన్షన్..!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలోని పలు నేతల నివాసాలపై ఐటీ దాడులు జరుగుతున్నాయి.

By Medi Samrat  Published on  25 Nov 2023 1:45 PM IST
వరుస సోదాలు.. తెలంగాణలో టెన్షన్.. టెన్షన్..!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలోని పలు నేతల నివాసాలపై ఐటీ దాడులు జరుగుతున్నాయి. తాండూరు ఎమ్మెల్యే, అధికార పార్టీ నేత పైలట్ రోహిత్ రెడ్డి ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. శనివారం ఉదయం మణికొండలోని పైలట్ నివాసంతో పాటు తాండూరులోని ఆయన సోదరుడి ఇంటికి అధికారులు చేరుకున్నారు. దాదాపు ఐదు చోట్ల ఏకకాలంలో ఐటీ దాడులు చేశారు. ఈ సోదాల్లో పైలట్ రోహిత్ రెడ్డి నివాసంలో లెక్కల్లో చూపని రూ. 20 లక్షల నగదును అధికారులు పట్టుకున్నారు. అదేవిధంగా పైలట్ సోదరుడి ఇంటిలో రూ.20 లక్షలు గుర్తించినట్లు తెలిపారు. ఈ నగదుతో పాటు పలు రికార్డులను స్వాధీనం చేసుకున్నారు.

మంత్రి మల్లారెడ్డి అనుచరుడు, బీఆర్ఎస్ బోడుప్పల్ పార్టీ అధ్యక్షుడు మంద సంజీవరెడ్డి ఇంట్లో కూడా సోదాలు జరిగాయి. ఎన్నికల అధికారులు, ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. సంజీవరెడ్డి నివాసానికి మల్లారెడ్డికి చెందిన డబ్బు భారీ మొత్తంలో చేరిందన్న ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో సోదాలు జరిగాయి. సంజీవరెడ్డిని ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా అడ్డుకుని సోదాలు చేశారు. సోదాల్లో ఎలాంటి డబ్బు దొరకలేదు.

Next Story