తమ సెనేట్‌లో ప్రసంగించాలని.. మంత్రి కేటీఆర్‌కు ఫ్రాన్స్ ఆహ్వానం

Invitation from the French Government to Minister KTR. తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌కు ఫ్రాన్స్‌ ప్రభుత్వం నుండి ప్రతిష్టాత్మక

By అంజి  Published on  13 Oct 2021 2:34 PM GMT
తమ సెనేట్‌లో ప్రసంగించాలని.. మంత్రి కేటీఆర్‌కు ఫ్రాన్స్ ఆహ్వానం

తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌కు ఫ్రాన్స్‌ ప్రభుత్వం నుండి ప్రతిష్టాత్మక ఆహ్వానం దక్కింది. ఫ్రెంచ్ సెనేట్‌లో జరిగే యాంబిషన్ ఇండియా - 2021 సదస్సులో ప్రసంగించాలని మంత్రి కేటీఆర్‌ను ఫ్రాన్స్‌ ప్రభుత్వం కోరింది. గ్రోత్ - డ్రాఫ్టింగ్ ఫ్యూచర్‌ ఆఫ్ ఇండో - ఫ్రెంచ్ రిలేషన్స్ ఇన్‌ పోస్ట్‌ కోవిడ్ ఎరా అంశంపై మంత్రి కేటీఆర్‌ మాట్లాడనున్నారు. ఈ నెల 29న ఫ్రాన్స్ ప్రధాని ఇమ్మాన్యూల్ మాక్రోన్‌ సారథ్యంలో ఫ్రెంచ్‌ సెనేట్‌లో యాంబిషన్ ఇండియా బిజినెస్‌ ఫోరం సమావేశం జరగనుంది. ఈ సదస్సు భారత్‌ - ఫ్రాన్స్‌ దేశాల మధ్య వ్యాపార, వాణిజ్య పెట్టుబడి సంబధాల బలోపేతానికి కృషి చేస్తుందని మంత్రి కేటీఆర్‌కు పంపిన లేఖలో ఫ్రాన్స్ ప్రభుత్వం పేర్కొంది.

కీనోట్‌ స్పీకర్‌గా పాల్గొని గ్రోత్ - డ్రాఫ్టింగ్ ఫ్యూచర్‌ ఆఫ్ ఇండో - ఫ్రెంచ్ రిలేషన్స్ ఇన్‌ పోస్ట్‌ కోవిడ్ ఎరా అంశంపై మాట్లాడాలని మంత్రి కేటీఆర్‌ను ఫ్రాన్స్ ప్రభుత్వం కోరింది. ఈ సదస్సులో ఈసారి ఎక్కువ మంది ఎక్కువ మంది వ్యాపార, వాణిజ్య కంపెనీల ప్రతినిధులు పాల్గొంటారని ఆశిస్తున్నామని లేఖలో పేర్కొంది. గతంలో జరిగిన ఆంబిషన్ ఇండియా సదస్సులో సుమారు 700 మంది వివిధ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బిజినెస్, పెట్టుబడి అంశాలను పరిచయం చేసేందుకు ఈ వేదిక ఎంతో ఉపయోగపడుతుందని ఫ్రాన్స్ ప్రభుత్వం పేర్కొంది. ఫ్రాన్స్ ప్రభుత్వం పంపిన ఆహ్వాన లేఖ పట్ల మంత్రి కేటీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. ఇది తెలంగాణ ప్రభుత్వ విధానాలకు దక్కిన గుర్తింపుగా భావిస్తున్నామని మంత్రి కేటీఆర్‌ అన్నారు.

Next Story
Share it