తెలంగాణలో ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదల

ఇంటర్మీడియట్ పరీక్షలు మార్చి 5 నుంచి 20 వరకు నిర్వహించనున్నట్లు ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ బోర్డ్ ప్రకటించింది.

By Medi Samrat  Published on  16 Dec 2024 12:45 PM GMT
తెలంగాణలో ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదల

ఇంటర్మీడియట్ పరీక్షలు మార్చి 5 నుంచి 20 వరకు నిర్వహించనున్నట్లు ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ బోర్డ్ ప్రకటించింది. మొదటి సంవత్సరం పరీక్షలు మార్చి 5న ప్రారంభ‌మై మార్చి 19న ముగుస్తాయి. ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు మార్చి 6న మొద‌లై మార్చి 20న ముగుస్తాయి. ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 3 ప్రారంభ‌మై ఫిబ్రవరి 22 వరకు జరుగుతాయి.

ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షల షెడ్యూల్

మార్చి 5: సెకండ్ లాంగ్వేజ్ పేపర్ I

మార్చి 7: ఇంగ్లీష్ పేపర్ I

మార్చి 11: మ్యాథమెటిక్స్ పేపర్ IA/ బోటనీ పేపర్ I/ పొలిటికల్ సైన్స్ పేపర్ I

మార్చి 13: మ్యాథమెటిక్స్ పేపర్ IB/ జువాలజీ పేపర్ I/ హిస్టరీ పేపర్ I

మార్చి 17: ఫిజిక్స్ పేపర్ I/ ఎకనామిక్స్ పేపర్ I

మార్చి 19: కెమిస్ట్రీ పేపర్ I/ కామర్స్ పేపర్ I

ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షల షెడ్యూల్

మార్చి 6: సెకండ్ లాంగ్వేజ్ పేపర్ II

మార్చి 10: ఇంగ్లీష్ పేపర్ II

మార్చి 12: మ్యాథమెటిక్స్ పేపర్ IIA/ బోటనీ పేపర్ II/ పొలిటికల్ సైన్స్ పేపర్ II

మార్చి 15: మ్యాథమెటిక్స్ పేపర్ IIB/ జువాలజీ పేపర్ II/ హిస్టరీ పేపర్ II

మార్చి 18: ఫిజిక్స్ పేపర్ II/ ఎకనామిక్స్ పేపర్ II

మార్చి 20: కెమిస్ట్రీ పేపర్ II/ కామర్స్ పేపర్ II

Next Story