వ‌ణికిస్తున్న చ‌లిపులి.. ఎల్లో అలర్ట్ ప్రకటించిన వాతావరణ శాఖ

IMD issues yellow alert for Hyderabad. హైదరాబాద్ నగరంతో పాటు పరిసర ప్రాంతాల్లో శుక్రవారం ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా తగ్గుముఖం

By Medi Samrat  Published on  28 Jan 2022 2:09 PM GMT
వ‌ణికిస్తున్న చ‌లిపులి.. ఎల్లో అలర్ట్ ప్రకటించిన వాతావరణ శాఖ

హైదరాబాద్ నగరంతో పాటు పరిసర ప్రాంతాల్లో శుక్రవారం ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. రాష్ట్రంలో వీకెండ్‌లోనూ చలి వాతావరణం కొనసాగుతుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. శుక్రవారం తెల్లవారుజామున నగరంలో సగటు కనిష్ట ఉష్ణోగ్రత 13.4 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది, ఇది ఊహించిన దాని కంటే కనీసం మూడు డిగ్రీలు తక్కువగా ఉంది. హయత్‌నగర్‌లో అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రత 11.3 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది.

నగరంలో పగటి ఉష్ణోగ్రతలు కూడా రెండు నుంచి మూడు డిగ్రీల మేర పడిపోయాయి. తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (టిఎస్‌డిపిఎస్) వివిధ ఆటోమేటిక్ వెదర్ స్టేషన్‌లలో (ఎడబ్ల్యుఎస్) నమోదు చేసిన డేటా ప్రకారం.. శనివారం మరియు ఆదివారం రాజేంద్రనగర్, చాంద్రాయణగుట్ట, ఎల్‌బి నగర్, సంతోష్ నగర్ మరియు చార్మినార్‌తో సహా నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల సెల్సియస్ కంటే తగ్గవచ్చు. హైదరాబాద్‌లోని వాతావరణ శాఖ రాబోయే మూడు రోజుల పాటు నగరానికి ఎల్లో అలర్ట్ ప్రకటించింది.

శుక్రవారం రాత్రి ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కు పడిపోవడంతో ఉత్తర తెలంగాణ జిల్లాల్లోని పలు ప్రాంతాలు వణికిపోయాయి. ఆదిలాబాద్‌లో అత్యల్పంగా 5.7 డిగ్రీల సెల్సియస్, కుమ్రం భీమ్ ఆసిఫాబాద్‌లో 6.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ అంచనా ప్రకారం.. రాబోయే మూడు రోజుల పాటు చాలా ప్రాంతాల్లో చలిగాలులు కొనసాగుతాయి.

హైదరాబాద్ నగరంలో అత్యల్ప ఉష్ణోగ్రతలు

హయత్‌నగర్ - 11.3 డిగ్రీల సెల్సియస్

రాజేంద్రనగర్ - 11.8 డిగ్రీల సెల్సియస్

సికింద్రాబాద్ - 12.4 డిగ్రీల సెల్సియస్

కుతుబుల్లాపూర్ - 13.7 డిగ్రీల సెల్సియస్

కూకట్‌పల్లి - 13.9 డిగ్రీల సెల్సియస్

రాష్ట్రంలోని జిల్లాల‌లో అత్యల్ప ఉష్ణోగ్రతలు

ఆదిలాబాద్ - 5.7 డిగ్రీల సెల్సియస్

కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ - 6.1 డిగ్రీల సెల్సియస్

మంచిర్యాల‌ - 7.9 డిగ్రీల సెల్సియస్

సంగారెడ్డి - 8.2 డిగ్రీల సెల్సియస్

మేడ్చల్-మల్కాజిగిరి - 8.6 డిగ్రీల సెల్సియస్


Next Story