తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఐఎండీ అలర్ట్ జారీ

రేపటి నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ తెలిపింది. ఈ మేరకు తెలుగు రాష్ట్రాలకు ఐఎండీ హెచ్చరిక జారీ చేసింది.

By అంజి  Published on  17 March 2024 6:24 AM IST
Heavy rains, Telangana, AndhraPradesh, IMD

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఐఎండీ అలర్ట్ జారీ

రేపటి నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ తెలిపింది. ఈ మేరకు తెలుగు రాష్ట్రాలకు ఐఎండీ హెచ్చరిక జారీ చేసింది. ఈ నెల 21 వరకు ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వానలు పడుతాయని అంచనా వేసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడతాయని తెలిపింది. మరోవైపు పగటిపూట ఉష్ణోగ్రతలు పెరుగుతాయని తెలిపింది. సాధారణం కంటే అధికంగా ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉన్నట్టు అంచనా వేసింది.

తూర్పు విదర్భ నుండి ఉత్తర తమిళనాడు వరకు విస్తరించి ఉన్న ద్రోణి ఇప్పుడు మరఠ్వాడా నుండి అంతర్గత కర్ణాటక మరియు తమిళనాడును దాటి కొమోరిన్ ప్రాంతం వరకు విస్తరించింది. దీని ఫలితంగా, మార్చి 20 వరకు మధ్య తెలంగాణ, కోస్తాంధ్ర, యానాంలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. అదే విధంగా జార్ఖండ్, ఒడిశా, విదర్భ, ఛత్తీస్‌గఢ్, తూర్పు మధ్యప్రదేశ్‌లు అక్కడక్కడా తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. పశ్చిమ బెంగాల్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర రాష్ట్రాలపై దీని ప్రభావం ఉండనుంది.

Next Story