ఐబొమ్మ రవి గురించి అడిషనల్ సీపీ శ్రీనివాసులు మీడియా ఎదుట పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. రవిని ఎలా ట్రాప్ చేశారో మీడియాకు వివరించారు. రవి భార్య మాకు సమాచారం ఇచ్చిందన్న వార్తలు అవాస్తవమని, ఆయన భార్యను మేం విచారించలేదన్నారు. పైరసీ వ్యవహారం దర్యాప్తు చాలా సంక్లిష్టతతో కూడిన వ్యవహారమని తెలిపారు. ఐ బొమ్మ రవి ఒంటరి, వారానికో దేశం తిరిగేవాడు. ఈజీ మనీకి అలవాటు పడ్డాడని పోలీసులు తెలిపారు. నిఖిల్ అనే వ్యక్తి రవికి మిత్రుడు. పైరసీ వెబ్‌సైట్‌కు డిజైన్లు తయారు చేసేవాడన్నారు. అతని ద్వారానే రవిని ట్రాప్ చేశామన్నారు. యాడ్ బుల్ అనే కంపెనీ రవికి చెందిందేనన్నారు.. ఈ కంపెనీకి డాలర్ల రూపంలో డబ్బు వచ్చేది. రవి సర్వర్లన్నీ నెదరలాండ్స్‌లో ఉన్నాయన్నారు. రవి టీం ఇంకా కరేబియన్ దేశంలోనే ఉందన్నారు. హైదరాబాద్, వైజాగ్‌లో రవి ఆస్తుల్ని గుర్తించామని, ఇప్పటిదాకా 3 కోట్లు సీజ్ చేశామన్నారు.
మూవీరూల్జ్, తమిళ్‌ఎంవీ లాంటి పలు పైరసీ వెబ్‌సైట్లు ఇప్పటికీ నడుస్తున్నాయి. ఆయా వెబ్‌సైట్ల నిర్వాహకులను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఐబొమ్మ పాపులర్ అయ్యాక.. దాని పేరును చాలా మంది వాడుకుంటున్నారని హైదరాబాద్ పోలీసులు తెలిపారు.