సీఎం సొంత జిల్లాలో వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకే అలా మాట్లాడుతున్నారు..

మెదక్ లోక్‌సభ సీటును గెలిచేందుకు బీఆర్‌ఎస్‌ సాయం తీసుకున్నారంటూ సీఎం రేవంత్‌రెడ్డి చేసిన ఆరోపణలను బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు తిప్పికొట్టారు

By Medi Samrat  Published on  5 Jun 2024 8:00 PM IST
సీఎం సొంత జిల్లాలో వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకే అలా మాట్లాడుతున్నారు..

మెదక్ లోక్‌సభ సీటును గెలిచేందుకు బీఆర్‌ఎస్‌ సాయం తీసుకున్నారంటూ సీఎం రేవంత్‌రెడ్డి చేసిన ఆరోపణలను బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు తిప్పికొట్టారు. ముఖ్యమంత్రి రేవంత్.. తన సొంత జిల్లా మహబూబ్‌నగర్‌ లోక్‌సభ, ఎమ్మెల్సీ సీట్లు గెలుపొందడంలో వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.

బుధవారం రఘునందన్‌రావు మాట్లాడుతూ.. 2013లో బీఆర్‌ఎస్‌ పార్టీని వీడినప్పటి నుంచి ఆ పార్టీకి వ్యతిరేకంగా పోరాడుతూనే ఉన్నానని.. ఎట్టిపరిస్థితుల్లోనూ వారి మద్దతు తీసుకోబోమన్నారు. బీజేపీ కార్యకర్తల మద్దతుతో నేను గెలిచాను.. హరీష్ రావు మ‌ద్ద‌తుతో కాదు అని స్ప‌ష్టం చేశారు.

ముఖ్యమంత్రి తాను ప్రాతినిధ్యం వహిస్తున్న మల్కాజిగిరి సీటును నిలబెట్టుకోలేదు.. ఇన్‌చార్జిగా ఉన్న చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గాన్ని గెలిపించుకోలేకపోయారని అన్నారు. అందుకే ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు బీఆర్‌ఎస్‌ సాయంతో బీజేపీ ఎనిమిది సీట్లు గెలుచుకుందని తప్పుడు ఆరోప‌ణ‌లు చేసేందుకు సీఎం ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

Next Story