పాకిస్తాన్‌ భద్రతా దళాలకు చిక్కిన తెలుగు యువకుడు విడుదల

Hyderabad Techie Released By Pakistan Army. పాకిస్తాన్‌ భద్రతా దళాలకు చిక్కిన తెలుగు యువకుడు ప్రశాంత్ విడుదలయ్యాడు.

By Medi Samrat  Published on  1 Jun 2021 9:08 AM GMT
పాకిస్తాన్‌ భద్రతా దళాలకు చిక్కిన తెలుగు యువకుడు విడుదల

పాకిస్తాన్‌ భద్రతా దళాలకు చిక్కిన తెలుగు యువకుడు ప్రశాంత్ విడుదలయ్యాడు. హైద్రాబాద్‌లోని ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో పని చేస్తున్న ప్రశాంత్‌.. 2017 లో సీజర్‌ లాండ్‌లోని తన ప్రియురాలిని కలవడానికి వెళుతున్న క్రమంలో పాక్‌కు భద్రతా దళానికి చిక్కాడు. అయితే ఎలాంటి వీసా, పాస్‌పోర్టు లేకుండా పాక్‌ భూభాగంలో అడుగుపెట్టడంతో ప్రశాంత్‌ను పాక్‌ భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నారు.

అయితే.. 2019లో తన కుమారుడిని రప్పించే ప్రయత్నం చేయాలంటూ సైబరాబాద్‌ సిపి సజ్జనార్‌ను ప్రశాంత్‌ తండ్రి బాబురావు కలిశారు. విదేశాంగ శాఖ సహకారంతో ప్రశాంత్‌ను తిరిగి స్వదేశానికి రప్పించారు. ఇంతకాలం పాక్‌లోనే ఉన్న ప్రశాంత్‌ను తాజాగా వాఘా సరిహద్దులో భారత్‌కు పాక్‌ అధికారులు అప్పజెప్పారు. దీంతో మంగళవారం ప్రశాంత్‌ హైదరాబాద్‌కు చేరుకోనున్నాడు. ప్రశాంత్‌ విడుదలతో అతని కుటుంబం ఆనందంలో మునిగి తేలుతోంది.


Next Story
Share it