రాష్ట్రంలో వడగండ్ల వానలు.. 24 గంటలు అప్రమత్తంగా ఉండాలన్న వాతావరణశాఖ

తెలంగాణలోని పలు జిల్లాల్లో వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది.

By Knakam Karthik
Published on : 21 March 2025 8:23 PM IST

Telangana, Weather, Rains, Hyderabad Meteorological Center, CM Revanthreddy

రాష్ట్రంలో వడగండ్ల వానలు.. 24 గంటలు అప్రమత్తంగా ఉండాలన్న వాతావరణశాఖ

తెలంగాణలోని పలు జిల్లాల్లో వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. ఒక్కసారిగా వాతావరణం చల్లబడటంతో, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఈదురు గాలులతో కురిసిన వానకు మామిడికాయలు రాలిపడ్డాయి. నిజామాబాద్, కరీంనగర్, మంచిర్యాల జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన వడగండ్ల వాన కురిసింది. ఈ వర్షానికి పలు ప్రాంతాల్లో వరి ధాన్యం తడిసి ముద్దయింది. పలుచోట్ల మామిడి తోటల్లో పూత, పిందెలు నేలరాలాయి. మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేటలో భారీగా వడగండ్ల వాన కురిసింది.

రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వడగండ్ల వాన కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ముందే హెచ్చరించింది. రానున్న రోజుల్లో కూడా పలు జిల్లాల్లో వడగండ్ల వాన కురిసే అవకాశముంది. రేపు ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్ కరీంనగర్ జిల్లాల్లో రేపు కూడా ఈదురుగాలులు, వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

అధికారులు అప్రమత్తంగా ఉండాలి: సీఎం

ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్ కరీంనగర్ జిల్లాల్లో రేపు కూడా ఈదురుగాలులు, వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో సీఎం రేవంత్ రెడ్డి అధికారులను అప్రమత్తం చేశారు. అన్ని విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండలాని, ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రాణ, ఆస్తినష్టం జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుని, ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. వెంటనే సంబంధిత జిల్లాల కలెక్టర్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని సీఎం ఆదేశించారు.

Next Story