తెలంగాణ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డిజిపి) శివధర్ రెడ్డి ఆస్ట్రేలియాలోని బోండి బీచ్‌లో ఇటీవల జరిగిన కాల్పుల సంఘటనకు హైదరాబాద్‌తో ఎటువంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు. నిందితుడు సాజిద్ అక్రమ్ నగరానికి చెందినవాడు అయినప్పటికీ హైదరాబాద్ నగరంతో సంబంధం లేదన్నారు.
హైదరాబాద్‌కు చెందిన సాజిద్ అక్రమ్ 1998లో ఉపాధి కోసం ఆస్ట్రేలియాకు వెళ్లాడని, అప్పటి నుండి అతను ఆరుసార్లు మాత్రమే భారతదేశానికి తిరిగి వచ్చాడని డీజీపీ తెలిపారు. ఆస్ట్రేలియాలో ఒక యూరోపియన్ మహిళను వివాహం చేసుకున్న తర్వాత, అతను 1998లో ఒకసారి ఆమెతో కలిసి హైదరాబాద్‌కు వచ్చాడన్నారు. సాజిద్ అక్రమ్ 27 సంవత్సరాల కాలంలో ఆరుసార్లు మాత్రమే భారతదేశానికి వచ్చాడని వెల్లడించారు. 2011 జూబ్లీ ప్రాపర్టీ సెటిల్మెంట్ ఇంకోసారి వచ్చాడని, 2016 మరోసారి ప్రాపర్టీ సెటిల్మెంట్ కోసం ఇక్కడికి వచ్చాడని చెప్పుకొచ్చారు. 2022 తల్లి, సోదరిని చూడటం కోసం నగరానికి డీజీపీ శివధర్ రెడ్డి చెప్పారు.