Hyderabad: దేశంలోనే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహం ప్రత్యేకతలివే
హైదరాబాద్ నడిబొడ్డున ట్యాంక్‌బండ్ పక్కనే తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్మృతివనం
By అంజి Published on 14 April 2023 4:45 AM GMTHyderabad: దేశంలోనే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహం ప్రత్యేకతలివే
హైదరాబాద్ నడిబొడ్డున ట్యాంక్‌బండ్ పక్కనే తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్మృతివనం ప్రారంభానికి ముస్తాబైంది. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి సంబంధించిన ప్రత్యేకతలు మీకోసం..
- ఈ విగ్రహం ఢిల్లీలో తయారు చేసి విడి భాగాలు తెచ్చి హైదరాబాద్‌లో అమర్చారు.
- ప్రారంభోత్సవం బౌద్ధ సంప్రదాయంలో చేస్తారు. ముఖ్య అతిథిగా అంబేద్కర్ మనుమడు ప్రకాష్ అంబేద్కర్ వస్తున్నారు.
- పీఠం కింద లైబ్రరీ, మ్యూజియం, అంబేదర్క జీవిత ముఖ్య ఘట్టాల ఫొటో గ్యాలరీ ఉంటాయి.
- మహారాష్ట్రకు చెందిన పద్మభూషణ్ అవార్డు గ్రహీత రామ్ వంజీ సుతార్, ఆయన కుమారుడు అనిల్ సుతార్ ఈ విగ్రహం రూపొందించారు.
- 11.04 ఎకరాల్లోని ఈ ప్రాజెక్టులో 2.93 ఎకరాల్లో థీమ్ పార్క్ ఉంటుంది.
- విగ్రహ పీఠం ఎత్తు 50 అడుగులు పార్లమెంటు ఆకారంలో దీన్ని నిర్మించారు.
- విగ్రహం తయారీ ఖర్చు రూ.146.50 కోట్లు.
- విగ్రహం బరువు 465 టన్నులు, అందులో ఇత్తడి 96 టన్నులు.
- హైదరాబాద్‌లో ఆవిష్కరించనున్న భారీ అంబేద్కర్ విగ్రహం ఎత్తు 125 అడుగులు, బేస్‌తో కలిపితే 175 అడుగులు
- ఈ విగ్రహం పక్కనే ఉన్న తెలంగాణ నూతన సచివాలయానికి కూడా అంబేద్కర్ పేరు పెట్టారు.
- అంబేద్కర్ విగ్రహాన్ని పూర్తిగా దేశీయంగానే తీర్చిదిద్దారు. నోయిడా డిజైన్ అసొసియేట్స్ నిర్మాణ బాధ్యతను తీసుకుంది.
- విగ్రహం యొక్క బయటి పొర రాజస్థాన్ నుండి సేకరించిన లేత గోధుమరంగు ఇసుకరాయితో తయారు చేయబడింది, అయితే క్లాడింగ్ కాంస్యంతో చేయబడింది.
- ఏప్రిల్ 11, 2016న అప్పటి ఉపముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అధ్యక్షతన 125 అడుగుల ఎత్తైన విగ్రహం ఏర్పాటుకు జీవో జారీ చేయబడింది.