జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వద్ద కారు బీభత్సం, ట్రాఫిక్ పోలీస్ బూత్‌ను ఢీకొట్టి..

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు వద్ద బీఎండబ్ల్యూ కారు బీభత్సం సృష్టించింది.

By Knakam Karthik
Published on : 15 Feb 2025 9:51 AM IST

Telugu News, Hyderabad, Jubilee Hills Check Post, Accident,

జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వద్ద కారు బీభత్సం, ట్రాఫిక్ పోలీస్ బూత్‌ను ఢీకొట్టి..

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు వద్ద బీఎండబ్ల్యూ కారు బీభత్సం సృష్టించింది. శనివారం తెల్లవారుజామున అతివేగంగా దూసుకొచ్చిన కారు జూబ్లీ చెక్‌పోస్టు వద్ద ట్రాఫిక్‌ పోలీస్‌ బూత్‌ దిమ్మెల్ని ఢీకొట్టింది. అయితే కారులోని ఎయిర్‌ బెలూన్లు తెరుచుకోవడంతో ప్రాణనష్టం తప్పింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునే లోపే.. కారులోని వ్యక్తులు అక్కడి నుంచి పరారయ్యారు. ప్రమాద సమయంలో డ్రైవర్‌ మద్యం మత్తులో ఉన్నట్లు అనుమానిస్తున్నారు.

కారు నంబర్‌ ప్లేట్‌ (TS09FY9990) ఆధారంగా యజమానిని గుర్తించేందుకు యత్నిస్తున్నారు. మాలిక్‌ జెమ్స్‌ అండ్‌ జ్యవెలరీ పేరుతో కారు రిజిస్ట్రేషన్‌ అయినట్లు తేల్చారు. ఇప్పటికే కారుపై రెండు పెండింగ్‌ చలాన్లు ఉన్నట్లు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. కారులో ఎంతమంది ఉన్నారనే విషయమై సీసీటీవీ వీడియోలను పరిశీలిస్తున్నారు.

Next Story