ఉచితంగా కుట్టు మిషన్లు కావాలా..? ఇలా తెచ్చుకోండి..!

కుట్టుపనికి సంబంధించిన శిక్షణ తీసుకున్న ముస్లిం, సిక్కు, బౌద్ధ, జైన, పార్సీలకు చెందిన మైనారిటీ వర్గాల నిరుద్యోగ మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు పంపిణీ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇటీవల తెలంగాణ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ (TGMFC) పథకం కింద దరఖాస్తులను ఆహ్వానించింది.

By Medi Samrat  Published on  21 Dec 2024 7:51 AM IST
ఉచితంగా కుట్టు మిషన్లు కావాలా..? ఇలా తెచ్చుకోండి..!

కుట్టుపనికి సంబంధించిన శిక్షణ తీసుకున్న ముస్లిం, సిక్కు, బౌద్ధ, జైన, పార్సీలకు చెందిన మైనారిటీ వర్గాల నిరుద్యోగ మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు పంపిణీ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇటీవల తెలంగాణ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ (TGMFC) పథకం కింద దరఖాస్తులను ఆహ్వానించింది. అభ్యర్థులు TGFMC అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.5 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షల లోపు వార్షికాదాయం ఉన్నవారు ఉచిత కుట్టు మిషన్లకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

https://tgobmms.cgg.gov.in/sewingForm.action

ఉచిత కుట్టు యంత్రాల కోసం ఎలా దరఖాస్తు చేయాలి

దరఖాస్తుదారులు ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌ను పూరించవచ్చు, అందులో వారు తమ ఆధార్ వివరాలు, రేషన్ కార్డ్ వివరాలు, కుల ధృవీకరణ పత్రం, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో (తప్పనిసరి) మరియు టైలర్ ట్రైనింగ్ సర్టిఫికేట్ అందుబాటులో ఉంటే అందించాలి.

దరఖాస్తుదారు సంబంధిత ధృవపత్రాలు అందుబాటులో పెట్టుకున్న తర్వాత, మొబైల్ ఫోన్లు, కంప్యూటర్ల ద్వారా అప్లికేషన్ ను నింపవచ్చు.

దశల వారీ పనులు:

# ఆన్‌లైన్ లో దరఖాస్తు ఫారమ్‌ను తెరవండి

# పేరు, ఆధార్ నెం, రేషన్ కార్డ్ నంబర్ లేదా ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ నంబర్‌ను నమోదు చేయండి

# రేషన్ కార్డ్ అందుబాటులో లేనట్లయితే, మీరు ఆదాయ ధృవీకరణ పత్రంతో దరఖాస్తు చేసుకోవచ్చు, వాటిని మీసేవా కేంద్రాలు లేదా

# MRO కార్యాలయాల నుండి పొందవచ్చు.

# తండ్రి/భర్త పేరు నమోదు చేయండి

# వార్షిక ఆదాయాన్ని, వైవాహిక స్థితి వివరాలను అందించండి

# మొబైల్ నంబర్‌ను నమోదు చేయండి

# మతాన్ని నమోదు చేయండి

# అభ్యర్థి ప్రభుత్వం ఆమోదించిన టైలర్ నుండి శిక్షణను పొంది ఉంటే, దానిని తెలియజేయండి.

# ఆధార్ కార్డులో ఇచ్చిన చిరునామాను నమోదు చేయండి

# ఫోటోగ్రాఫ్ (తప్పనిసరి), టైలర్ ట్రైనింగ్ సర్టిఫికేట్ (అందుబాటులో ఉంటే) అటాచ్ చేయండి

# అభ్యర్థి సిక్కు, బౌద్ధ, జైన్ లేదా పార్సీ అయితే, కుల ధృవీకరణ పత్రాన్ని జత చేయండి.

గమనిక: ముస్లిం దరఖాస్తుదారులు ఎలాంటి కుల ధృవీకరణ పత్రాన్ని అప్‌లోడ్ చేయవలసిన అవసరం లేదు

# వివరాల ధృవీకరణ తర్వాత Submit మీద క్లిక్ చేయండి

ఉచిత కుట్టు యంత్రం కోసం అప్లికేషన్‌ను ప్రింట్ చేసి, డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఈ పథకానికి ఎంపిక అయ్యారా లేదా అన్నది దరఖాస్తుదారులకు ప్రభుత్వం ధృవీకరించిన తర్వాత తెలియజేస్తారు.

Next Story