తెలంగాణలో సూర్యుడి భగభగలు.. రానున్న 5 రోజుల పాటు వేడిగాలులు
తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. వేడి గాలులు జనాలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల
By అంజి Published on 15 May 2023 10:16 AM ISTతెలంగాణలో సూర్యుడి భగభగలు.. రానున్న 5 రోజుల పాటు వేడిగాలులు
తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. వేడి గాలులు జనాలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఎండలు దంచికొడుతున్నాయి. రానున్న రోజుల్లో రాష్ట్రంలోని పలు జిల్లాలకు వడగాలుల హెచ్చరికను తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (టిఎస్‌డిపిఎస్) ఆదివారం జారీ చేసింది. నేటి నుంచి వచ్చే ఐదు రోజుల పాటు హైదరాబాద్ నగరంలో గరిష్ట ఉష్ణోగ్రత 40 నుండి 46 డిగ్రీల సెల్సియస్ మధ్యకు చేరుకునే అవకాశం ఉంది. హైదరాబాద్‌లో రానున్న ఐదు రోజుల పాటు గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యే అవకాశం ఉంది. ఎండల తీవ్రత అధికంగా ఉండటంతో వడదెబ్బ బారిన పడే ప్రమాదం ఉండటంతో, అవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దని వైద్యులు సూచిస్తున్నారు.
వారం రోజుల క్రితం హైదరాబాద్ నగరంలో, తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో చెదురుమదురు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కురిశాయి. జగిత్యాల, కరీంనగర్, మంచిర్యాల, ఆదిలాబాద్, ములుగు, కుమురం భీమ్, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, ఖమ్మం, పెద్దపల్లి జిల్లాలు 40 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా నమోదవుతున్నాయి. ఆదివారం అత్యధికంగా మంచిర్యాల జిల్లా కొండాపూర్‌లో 45.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నాలుగు రోజుల ముందు, హైదరాబాద్‌లోని చార్మినార్, బహదూర్‌పురా, జూ పార్క్, రాజేంద్రనగర్ వంటి వివిధ ప్రాంతాల్లో తీవ్రమైన వర్షాలు కురిశాయి. వేసవి తాపాన్ని తగ్గించేందుకు వర్షాలు చాలా ఉపశమనాన్ని అందించాయి.