సీఎం కేసీఆర్‌కు అస్సాం ముఖ్యమంత్రి జన్మదిన శుభాకాంక్షలు

Himanta Biswa wishes CM KCR on his birthday. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ గురువారం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు

By Medi Samrat  Published on  17 Feb 2022 4:22 AM GMT
సీఎం కేసీఆర్‌కు అస్సాం ముఖ్యమంత్రి జన్మదిన శుభాకాంక్షలు

అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ గురువారం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. "తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కె చంద్రశేఖర్ రావు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మా కామాఖ్య మరియు మహాపురుష్ శ్రీమంత శంకర్‌దేవ్ మీకు మంచి ఆరోగ్యంతో పాటు దీర్ఘాయుష్షును ప్రసాదిస్తారని ఆయన ట్వీట్ చేశారు.

ప్రధాని నరేంద్ర మోదీ కూడా తెలంగాణ ముఖ్యమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి ఆయన ఆరోగ్యంగా జీవించాలని ప్రార్థించారు. "తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఆయన దీర్ఘాయుష్షుతో ఆరోగ్యంగా జీవించాలని ప్రార్థిస్తున్నాను. @TelanganaCMO' అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.

కేసీఆర్‌గా పేరుగాంచిన కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఫిబ్రవరి 17, 1954లో మెదక్ జిల్లా చింతమడకలోజన్మించారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కీల‌క‌పాత్ర పోషించిన‌ తెలంగాణ రాష్ట్ర సమితి (TRS) వ్యవస్థాపక అధ్యక్షుడు కేసీఆర్‌. కేసీఆర్‌ వివిధ నియోజకవర్గాల నుంచి పలు దఫాలుగా శాసనసభ సభ్యుడిగా ఎన్నిక‌య్యారు. కేసీఆర్ పార్ల‌మెంట్ స‌భ్యుడిగా ఎన్నికై కార్మిక మరియు ఉపాధి కేబినెట్ మంత్రిగా కూడా పనిచేశారు.

రాష్ట్రం ఏర్ప‌డ్డాక జరిగిన 2014 ఎన్నికలలో 119 అసెంబ్లీ స్థానాలకు గాను 63 స్థానాల్లో టీఆర్ఎస్ విజయం సాధించింది. తద్వారా ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన శాసనసభ్యుల సంఖ్యను పొందింది. దీంతో తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేశారు. 2018 అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో చంద్రశేఖర్ రావు నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితి 88 స్థానాల్లో విజయం సాధించగా.. డిసెంబర్ 13, 2018న తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ రెండ‌వ‌సారి ప్రమాణ స్వీకారం చేశారు.


Next Story