Telangana: గ్రూప్-1 నియామకాలపై హైకోర్టు కీలక తీర్పు

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) నిర్వహించిన గ్రూప్ 1 పరీక్షపై నెలకొన్న వివాదంలో హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది.

By -  Knakam Karthik
Published on : 5 Feb 2026 1:42 PM IST

Telangana, High Court,  TGPSC,  Group 1 exam, Congress Government

Telangana: గ్రూప్-1 నియామకాలపై హైకోర్టు కీలక తీర్పు

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) నిర్వహించిన గ్రూప్ 1 పరీక్షపై నెలకొన్న వివాదంలో హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. గతంలో సింగిల్ బెంచ్ జడ్జి ఇచ్చిన తీర్పును సీజే ధర్మాసనం రద్దు చేసింది. గురువారం ఉదయం వెలువరించిన తీర్పు ప్రకారం.. 2024 అక్టోబర్ లో జరిగిన మెయిన్స్ పరీక్షల్లో అవకతవకలు జరగాయన్న ఆరోపణలను తోసిపుచ్చింది. జవాబు పత్రాలను మళ్లీ మూల్యాంకనం చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.

దీంతో గ్రూప్ - 1 ఉద్యోగాలకు ఎంపికైన 562 మంది అభ్యర్థులకు ఊరట లభించింది. 2024 లో నిర్వహించిన గ్రూప్ 1 పరీక్షల్లో మొత్తం 562 మంది అభ్యర్థులను టీజీపీఎస్సీ ఎంపిక చేసింది. ఎంపికైన అభ్యర్థులకు 2025 సెప్టెంబర్ 27న సీఎం రేవంత్ రెడ్డి నియామక పత్రాలు అందించారు.

ఇదీ వివాదం..

టీజీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలకు సంబంధించి మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయని, మార్కుల కేటాయింపులో పారదర్శకత లేదని పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు.

ఈ పిటిషన్ ను విచారించిన సింగిల్ బెంచ్ జడ్జి.. గ్రూప్‌-1 మెయిన్స్‌ ర్యాంకింగ్ లను రద్దు చేశారు. జవాబుపత్రాలను రీ వాల్యుయేషన్ చేయాలని ఆదేశించారు. ఈ తీర్పుపై గ్రూప్ 1 కు ఎంపికైన అభ్యర్థులతో పాటు టీజీపీఎస్సీ కూడా హైకోర్టులో అప్పీల్ చేసింది.

Next Story