హైకోర్టులో రేవంత్‌రెడ్డికి చుక్కెదురు

High Court Rejects Revanth Reddy Petition. ఓటుకు కోట్లు కేసులో రేవంత్‌రెడ్డికి హైకోర్టులో చుక్కెదురైంది. ఓటుకు కోట్లు కేసు ఏసీబీ పరిధిలోకి

By Medi Samrat  Published on  1 Jun 2021 2:09 PM GMT
హైకోర్టులో రేవంత్‌రెడ్డికి చుక్కెదురు

ఓటుకు కోట్లు కేసులో రేవంత్‌రెడ్డికి హైకోర్టులో చుక్కెదురైంది. ఓటుకు కోట్లు కేసు ఏసీబీ పరిధిలోకి రాదని, ఎన్నికల కమిషన్‌ పరిధిలోకి వస్తుందని పేర్కొంటూ హైకోర్టులో రేవంత్‌రెడ్డి పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ పిటిషన్‌ను విచారించకుండానే హైకోర్టు కొట్టివేసింది.

గతంలో ఎసిబి కోర్టులో ఇదే పిటిషన్‌ రేవంత్‌రెడ్డి దాఖలు చేయగా.. అక్కడా ఇదే పరిస్థితి ఎదురైంది. దీంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఇదిలా ఉండగా.. 2015లో జరిగిన తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నామినేటెడ్‌ ఎమ్మెల్యే స్టీవెన్‌సన్‌ను ప్రలోభపెట్టేందుకు రేవంత్‌రెడ్డి ప్రయత్నిస్తూ కెమెరాకు అడ్డంగా దొరికిపోయారు. అప్పటి నుంచి ఈ కేసు విచారణ నడుస్తోంది. ఇటీవలే ఈ కేసుకు సంబంధించి ఛార్జ్‌షీట్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ దాఖలు చేసింది.




Next Story