ఇబ్రహీంపట్నం మున్సిపల్ ఎన్నికపై హైకోర్టు తుది తీర్పు ఇచ్చింది. మూడు వారాల్లోగా ఎన్నిక ప్రక్రియను పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కౌన్సిలర్లు ఎలాంటి ఒత్తిడికి లోనవకుండా తమ మద్దతు తెలియజేసేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. మున్సిపల్ చైర్మన్ ఎన్నిక జరగాల్సిన సమయంలో 19వ కార్డు బీఆర్‌ఎస్ కౌన్సిలర్ ఆకుల యాదగిరి కనిపించకుండా పోయాడు. దీంతో తన తండ్రిని ప్రత్యర్థి పార్టీ నేతలు కిడ్నాప్ చేశారంటూ యాదగిరి కుమారుడు హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టి చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియపై స్టే విధించింది. తాజగా ధర్మాసనం మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికను మూడు వారాల్లోపు పూర్తి చేయాలని తుది తీర్పును వెలువరించింది .