తెలంగాణలో మరో 4 రోజుల పాటు భారీ వర్షాలు
తెలంగాణలో మరో 4 రోజులు పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది.
By అంజి Published on 17 July 2023 1:30 AM GMTతెలంగాణలో మరో 4 రోజుల పాటు భారీ వర్షాలు
తెలంగాణలో మరో 4 రోజులు పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే రోజుల్లో హైదరాబాద్, తెలంగాణలోని ఇతర జిల్లాలు ఈ సంవత్సరం ఉత్తమ రుతుపవనాల స్పెల్‌ను చూసే అవకాశం ఎక్కువగా ఉంది. హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రం ఆదివారం నాడు.. మంగళవారం నుండి వచ్చే నాలుగు రోజుల్లో భారీ వర్షాలు కురిసే హెచ్చరికను జారీ చేసింది. ఐఎండీ - హైదరాబాద్ సూచన ప్రకారం.. సంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, మెదక్ సహా హైదరాబాద్, దాని చుట్టుపక్కల జిల్లాల్లో ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఆదిలాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల్ సహా ఉత్తర తెలంగాణలోని జిల్లాలు, ములుగు, పెద్దపల్లిలో రానున్న రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. గత 24 నుంచి 48 గంటల్లో హైదరాబాద్‌లో వాతావరణం మేఘావృతమై అక్కడక్కడా చిరుజల్లులు కురుస్తున్నాయి. అలాగే రాష్ట్రంలోని కరీంనగర్, మేడ్చల్-మల్కాజిగిరి, వికారాబాద్, సిద్దిపేట, సిరిసిల్ల, వరంగల్, హన్మకొండ, ములుగు సహా పలు జిల్లాల్లో మంచి వర్షాలు కురుస్తున్నాయి.
వచ్చే శనివారం వరకు ఎడతెగని జల్లులతో కూడిన మేఘావృత పరిస్థితులు వారం మొత్తం చురుకుగా ఉండే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. మెరుపులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందని ప్రజలను అప్రమత్తం చేసింది. ఈ వర్షాకాలంలో ఇప్పటివరకు హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని దాదాపు 20 జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైంది. అయితే ఐఎండీ హైదరాబాద్ అంచనాల విశ్లేషణ ఆధారంగా.. రాబోయే కొద్ది రోజుల్లో జూలై 17, జూలై 25 మధ్య భారీ వర్షపాతం హెచ్చరిక కారణంగా గోదావరిలో భారీ ఇన్‌ఫ్లో అంచనా వేయబడింది.