తెలంగాణలో 3 రోజుల పాటు భారీ వర్షాలు
భారత వాతావరణ శాఖ.. తెలంగాణకు భారీ వర్ష సూచన జారీ చేసింది. రాష్ట్రంలో నేటి నుంచి గురువారం వరకు తేలికపాటి నుంచి అతి భారీ వర్షాలు
By అంజి Published on 4 July 2023 5:06 AM GMTతెలంగాణలో 3 రోజుల పాటు భారీ వర్షాలు
భారత వాతావరణ శాఖ.. తెలంగాణకు భారీ వర్ష సూచన జారీ చేసింది. రాష్ట్రంలో నేటి నుంచి గురువారం వరకు తేలికపాటి నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. దాదాపు అన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. నైరుతి ఆవర్తనం, దాని పరిసరాల్లో ఆగ్నేయ బంగాళాఖాతం సగటు సముద్ర మట్టం నుంచి 3.1 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోందని వెల్లడించింది. వర్షాలు దృష్ట్యా ప్రజలు తమ ప్రయాణాలను జాగ్రత్తలు పాటిస్తూ చేసుకోవాలని తెలిపింది.
నేడు నిజామాబాద్, జగిత్యాల, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, వరంగల్, ఖమ్మం, నల్గొండ, మహబూబాబాద్, హన్మకొండ, యాదాద్రి భువనగిరి, హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, వికారాబాద్, నాగర్ కర్నూలు, మేడ్చల్ మల్కాజ్‌గిరి, సూర్యపేట, సంగారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. రేపు ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, సిద్దిపేట, రాజన్నసిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, కామారెడ్డి, వికారాబాద్, మెదక్, హైదరాబాద్, మేడ్చల్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయి.
ఎల్లుండి జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, వరంగల్, జనగామ, హన్మకొండ, మహబూబాబాద్, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.