నేడు తెలంగాణలో భారీ వర్షాలు, వడగళ్ల వాన.. ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ

భారత వాతావరణ శాఖ (IMD) -హైదరాబాద్.. 2023 ఏప్రిల్ 27న భారీ వర్షాలు, వడగళ్ల వాన కారణంగా హైదరాబాద్, తెలంగాణలోని ఇతర

By అంజి  Published on  27 April 2023 12:23 PM IST
Heavy rains, hailstorm, Telangana, IMD Hyderabad

నేడు తెలంగాణలో భారీ వర్షాలు, వడగళ్ల వాన.. ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ

భారత వాతావరణ శాఖ (IMD) -హైదరాబాద్.. 2023 ఏప్రిల్ 27న భారీ వర్షాలు, వడగళ్ల వాన కారణంగా హైదరాబాద్, తెలంగాణలోని ఇతర జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఒక రోజు విరామం తర్వాత నగరంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. సాయంత్రం లేదా రాత్రి గాలులుతో కూడిన వడగళ్ల వానలు పడే అవకాశం ఉంది. ఐఎండీ హైదరాబాద్ ప్రకారం.. హైదరాబాద్‌లోని మొత్తం ఆరు జోన్‌లు: చార్మినార్, ఖైరతాబాద్, కూకట్‌పల్లి, ఎల్‌బి నగర్, సికింద్రాబాద్, శేరిలింగంపల్లిలో సాధారణంగా మేఘావృతమై తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది.

హైదరాబాద్‌ పొరుగు జిల్లాల్లో భారీ వర్షాలు, వడగళ్ల వానలు

హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాలు, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, సిద్దిపేట, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాలు వర్షాలు కురవనున్నాయి. మెరుపులతో కూడిన ఉరుములు, వడగళ్ల వాన, భారీ వర్షంతో కూడిన ఈదురు గాలులను వీసే అవకాశం ఉంది. తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (TSDPS) కూడా ఈరోజు నగరంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.

అయితే, హైదరాబాద్‌లో ఉష్ణోగ్రతలో గణనీయమైన తేడా ఉండదని, గరిష్ట ఉష్ణోగ్రత 36-40 డిగ్రీల సెల్సియస్‌లో ఉంటుందని అంచనా.

కరెంటు కోత, వర్షాల సమయంలో భారీ ట్రాఫిక్

హైదరాబాద్‌లో కురిసిన వర్షపాతం వేసవి వేడి నుండి ఉపశమనం కలిగించినప్పటికీ.. ముఖ్యంగా విద్యుత్ కోతలు, భారీ ట్రాఫిక్ విషయానికి వస్తే ఇది చాలా సవాళ్లను కలిగి ఉంది. నగరంలో ఎలక్ట్రికల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సరిగ్గా లేకపోవడంతో భారీ వర్షాల ఆసమయంలో గంటల తరబడి విద్యుత్‌ అంతరాయాలు జరుగుతున్నాయి. హైదరాబాద్‌లో వర్షాల సమయంలో తలెత్తే మరో సమస్య విపరీతమైన ట్రాఫిక్. నగరంలోని రోడ్లన్నీ తరచూ వాహనాలతో కిక్కిరిసిపోతున్నాయి, వర్షం పడితే పరిస్థితి మరింత దిగజారుతోంది. ట్రాఫిక్ జామ్‌ల వల్ల ప్రజలు సమయానికి తమ గమ్యస్థానాలకు చేరుకోవడం చాలా ఆలస్యం అవుతుంది.

ఐఎండీ హైదరాబాద్, టీఎస్‌డీపీఎస్‌ రెండూ చేసిన సూచనల దృష్ట్యా.. నివాసితులు అప్రమత్తంగా ఉండాలని, ఎటువంటి ఊహించలేని పరిస్థితులను నివారించడానికి అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. భారీ వర్షాలు కురుస్తున్న సమయంలో ప్రయాణానికి దూరంగా ఉండాలని, వీలైతే ఇంట్లోనే ఉండాలని సిఫార్సు చేయబడింది.

Next Story