మాజీమంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. కోర్టులో అవినాష్ రెడ్డి తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. వివేకా కేసులో సీబీఐ విచారణ ఉద్దేశపూర్వకంగా జరుగుతోందని కోర్టులో వాదనలు వినిపించారు. దస్తగిరి అనుచరుడు మున్నా స్టేట్‌మెంట్ రికార్డు చేయలేదని.. మున్నా బ్యాంక్ లాకర్ నుంచి రూ.46 లక్షలు రికవరీ చేశారని కోర్టుకు తెలిపారు. దస్తగిరి ముందస్తు బెయిల్‌ను సీబీఐ అడ్డుకోలేదని.. దస్తగిరిని అప్రూవర్‌గా మార్చి.. సీబీఐ తమకు అనుకూలంగా స్టేట్‌మెంట్ రాయించుకుందని కోర్టులో అవినాష్ తరుపు న్యాయవాది తన వాదనలు వినిపించారు. సుమారు రెండు గంటలు పాటు అవినాష్ రెడ్డి న్యాయవాది తన వాదనలు వినిపించారు. అనంతరం బోజన విరామ సమయంలో కోర్టు కాసేపు విచారణను వాయిదా వేసింది. విరామం అనంతరం మళ్లీ వాదనలు తిరిగి ప్రారంభం కానున్నాయి.