Breaking: బీసీ రిజర్వేషన్ల అంశంపై విచారణ రేపటికి వాయిదా
హైదరాబాద్: బీసీ రిజర్వేషన్ల అంశం విచారణను తెలంగాణ హైకోర్టు రేపు మధ్యాహ్నానికి వాయిదా వేసింది. సుదీర్ఘ వాదనల అనంతరం తదుపరి విచారణను రేపు మధ్యాహ్నం 2.15గంటలకు రిజర్వేషన్ల కేసును వాయిదా వేసింది. కాగా స్థానిక ఎన్నికల ప్రొసీజన్‌పై ధర్మాసనం ఎలాంటి స్టే ఇవ్వలేదు. దీంతో షెడ్యూల్ ప్రకారం రేపు స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావాల్సి ఉంది. అయితే కోర్టు వాయిదా నేపథ్యంలో రేపటి నోటిఫికేషన్‌పై ఉత్కంఠ నెలకొంది.