తెలంగాణ అసెంబ్లీ స్పెషల్ సెషన్ ప్రారంభమైన కొద్దిసేపటికే వాయిదా పడ్డాయి. మంగళవారం ఉదయం 11 గంటకు ప్రారంభం అయిన వెంటనే కేబినెట్ సమావేశం నేపథ్యంలో శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు సభను వాయిదా వేయాలని స్పీకర్‌ను కోరారు. దీంతో అసెంబ్లీ స్పీకర్ సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు. అయితే అసెంబ్లీ వాయిదా వేయడంపై బీఆర్ఎస్ నేతలు ఫైర్ అవుతున్నారు. ఈ క్రమంలోనే మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు.
అసెంబ్లీ ప్రారంభమైన రెండు నిమిషాలకే వాయిదా వేయడం ఏంటని ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. కేబినెట్ సమావేశం ఇంకా కొనసాగుతుందని.. సబ్జెక్ట్, నోట్స్ సిద్ధం చేయాలని సభను వాయిదా వేయాలని మంత్రి శ్రీధర్ బాబు కోరడం హాస్యాస్పదమని విమర్శించారు. నాడు ప్రతి పక్షంలో ఉన్నా ప్రిపేర్ కాలేదు.. నేడు పాలకపక్షంలో ఉన్నా ప్రిపేర్ కాలేదు.. ఇంకెప్పుడు ప్రిపేర్ అవుతారని సెటైర్ వేశారు.