హరీశ్‌రావు అరెస్ట్
సైబరాబాద్ సీపీ కార్యాలయం వద్ద నిరసనకు దిగిన బీఆర్‌ఎస్ నేతలను పోలీసులు అరెస్టు చేశారు
By Medi Samrat Published on 12 Sep 2024 2:48 PM GMTసైబరాబాద్ సీపీ కార్యాలయం వద్ద నిరసనకు దిగిన బీఆర్‌ఎస్ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డితో పాటు బీఆర్‌ఎస్ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకొని శంషాబాద్ పీఎస్‌కు తరలించారు. గాంధీపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని బీఆర్‌ఎస్ డిమాండ్ చేశారు. అరెస్టు చేయకపోతే కోర్టు వెళ్తామని హరీశ్‌రావు స్పష్టం చేశారు.
కొండాపూర్‌లోని కౌశిక్ రెడ్డి నివాసానికి వచ్చిన గాంధీని పోలీసులు వారిని అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు. అయితే, దాడిని నిరసిస్తూ బీఆర్‌ఎస్ సీపీ ఆఫీస్ వద్ద ఆందోళనకు దిగింది. కౌశిక్ రెడ్డిపై దాడి చేసిన వారిని అరెస్ట్ చేసే వరకు ఇక్కడి నుంచి వెళ్లేది లేదని హరీశ్ రావు సహా బీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగారు. దాడిని ప్రోత్సహించిన సీఐ, ఏసీపీలను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి కేసును సుమోటోగా సేకరించిన సైబరాబాద్ పోలీసులు. ఏ1 అరికెపూడి గాంధీ తో పాటు 15 మంది గాంధీ అనుచరులు తదితరులపై కేసు నమోదు చేశారు. గచ్చిబౌలి ఎస్సై మహేష్ కుమార్ ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు.