ఆదివారం.. ఆర్థిక‌మంత్రి.. ఆట‌విడుపు..!

Harish Rao Playing Cricket. నిత్యం ఏదో ఒక బిజీతో గడిపే మంత్రి హరీశ్ ఆదివారం కావడం సిద్దిపేటలోని పర్యటనలు, కార్యక్రమాలు

By Medi Samrat  Published on  16 Nov 2020 9:14 AM IST
ఆదివారం.. ఆర్థిక‌మంత్రి.. ఆట‌విడుపు..!

నిత్యం ఏదో ఒక బిజీతో గడిపే మంత్రి హరీశ్ రావు ఆదివారం కావడం సిద్దిపేటలోని పర్యటనలు, కార్యక్రమాలు ముగించుకుని.. సిద్దిపేట మినీ ట్యాంక్ బండ్ పై కాసేపు కలియ తిరిగారు. ట్యాంక్ బండ్ పై వచ్చిన పర్యాటకులతో కాసేపు ఆత్మీయంగా ముచ్చటించారు. మినీ ట్యాంక్ బండ్ పై చిన్నారులతో మ్యూజిక్ ప్లే చేస్తూ సరదాగా కాసేపు కలియ తిరిగారు.

అనంత‌రం మెదక్ పోలీసు వర్సెస్ సిద్ధిపేట పోలీస్ డే అండ్ నైట్ క్రికెట్ మ్యాచ్‌ను సిద్దిపేట స్టేడియంలో మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. సిద్ధిపేట మినీ స్టేడియంలో ఆదివారం సాయంత్రం మెదక్ ఎస్పీ పోలీస్ వర్సెస్ సిద్ధిపేట పోలీసు కమిషనరేట్ మధ్య 20 ఓవర్ల క్రికెట్ మ్యాచ్ జరిగింది. ఇరు జట్ల మధ్య జరుగుతున్న ఈ మ్యాచ్ కు ముఖ్య అతిథిగా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు హాజరై టాస్ వేసిన అనంతరం.. ఆటలో భాగంగా ఒక ఓవర్ బ్యాటింగ్ చేసి, ఓ ఓవర్ బౌలింగ్ చేశారు.

ఈ మేరకు సిద్ధిపేట పోలీసు కమిషనర్ జోయల్ డేవిస్ బౌలింగ్ చేయగా.. మంత్రి హరీశ్ రావు బ్యాటింగ్ చేసి విన్నూత్న షాట్లు కొడుతూ తన బ్యాటింగ్ శైలిని కనబర్చారు. ఆ తర్వాత మంత్రి బౌలింగ్ చేయగా.. పోలీసు కమిషనర్ జోయల్ డేవిస్ బ్యాటింగ్ చేయడం అక్కడి క్రీడాకారులతో పాటు వీక్షకులందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.


Next Story