ఆర్థిక‌ మంత్రి ఆట‌గాడైతే..

Harish Rao Played Cricket Match. నిత్యం రాష్ట్ర‌మంతా క‌లియ‌తిరిగే ఆర్థిక‌ మంత్రి హరీశ్ రావు క్రికెట్‌ ఆట‌గాడిగా ద‌ర్శ‌న‌మిచ్చారు.

By Medi Samrat  Published on  26 Jan 2021 8:34 AM IST
Harish Rao Played Cricket Match

నిత్యం రాష్ట్ర‌మంతా క‌లియ‌తిరిగే ఆర్థిక‌ మంత్రి హరీశ్ రావు క్రికెట్‌ ఆట‌గాడిగా ద‌ర్శ‌న‌మిచ్చారు. జహీరాబాద్ జిల్లా అధికార యంత్రాంగంతో క‌లిసి క్రికెట్ మ్యాచ్ ఆడారు. వివ‌రాళ్లోకెళితే.. జహీరాబాద్ లోని బాగారెడ్డి మైదానంలో ఫ్లడ్‌లైట్లు ప్రారంభించిన మంత్రి హరీశ్ రావు.. అనంత‌రం క్రికెట్ మ్యాచ్ ఆడారు. జిల్లా కలెక్టర్ హన్మంతరావు టీమ్‌ వ‌ర్సెస్ మంత్రి హరీశ్ రావు టీంలు హోరాహోరిగా త‌ల‌ప‌డ్డాయి.

ఈ గేమ్‌లో తొలుత టాస్ గెెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కలెక్టరు టీమ్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన మంత్రి హరీష్ రావు టీమ్ మెరుపులు మెరిపించింది. ఫోర్లు, సిక్స‌ర్ల‌తో ప్ర‌త్య‌ర్ది టీమ్‌పై విరుచుకుప‌డుతూ ఫ్రోఫెషనల్ క్రికెట్ గేమ్‌ను చూస్తున్నామా అన్న వాతావ‌ర‌ణాన్ని క‌ల్పించింది. మంత్రి హరీశ్ రావు బ్యాటింగ్ చేస్తున్న వేళ జహీరాబాద్ క్రీడాభిమానులు చప్పట్లతో ప్రోత్సహించారు.

ఇదిలావుంటే.. మంత్రి హరీశ్ రావు ఇంత‌కుముందు కూడా ఆట‌విడుపుగా క్రికెట్ మ్యాచ్‌లు ఆడారు. న‌వంబ‌ర్‌లో మెదక్ పోలీసు వర్సెస్ సిద్ధిపేట పోలీస్ డే అండ్ నైట్ క్రికెట్ మ్యాచ్‌ను సిద్దిపేట స్టేడియంలో ప్రారంభించారు. బ్యాటింగ్, బౌలింగ్ చేసి ఆయ‌న‌లో దాగివున్న‌ క్రీడాకారుణ్ని త‌ట్టిలేపారు.


Next Story