రేవంత్ రెడ్డి తలకిందకు పెట్టి కాళ్ళు పైకి పెట్టి తపస్సు చేసినా వచ్చే సారి వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని. ముఖ్యమంత్రి అయ్యేది కేసీఆరేనని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. సిద్దిపేటలో ఎవరో ఎందుకు..? రేవంత్ రెడ్డే నాపై పోటీకి దిగాలని సవాల్ విసిరారు. డీలిమిటేషన్ ఎప్పుడో జరగాల్సిందన్నారు.. సీట్లు పెరిగి, మహిళా రిజర్వేషన్ అమలు జరిగితే స్వాగతిస్తామన్నారు. మహిళా రిజర్వేషన్ల కోసం అసెంబ్లీలో తీర్మానం చేసి పంపిన పార్టీ బీఆర్ఎస్ అని గుర్తుచేశారు.
నిరుద్యోగులను కాంగ్రెస్ ప్రభుత్వం వంచించిందని.. అసెంబ్లీలో ప్రభుత్వం ఇచ్చిన సమాధానం ద్వారా తేటతెల్లమైందన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు అతి తక్కువ నిధులు.. అంటే 2 % నిధులు ఖర్చు పెట్టిన కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో ఎలా గెలుస్తుంది.? అని ప్రశ్నించారు. బడ్జెట్ అన్ని వర్గాలను నిరాశ పరిచింది.. గ్యారంటీలను తుంగలో తొక్కింది.. కనుకే బడ్జెట్ పేపర్లు చించేశాం.. చెవిలో పూలు పెట్టుకుని నిరసన తెలిపామన్నారు. ఈ ప్రభుత్వనికి మాటలు ఎక్కువ.. చేతలు తక్కువ అని విమర్శనాస్త్రాలు సంధించారు.