హమ్మయ్య.. సీఎంను క‌లిసిన గుమ్మడి నర్సయ్య

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య కలిశారు.

By Medi Samrat
Published on : 18 March 2025 4:37 PM IST

హమ్మయ్య.. సీఎంను క‌లిసిన గుమ్మడి నర్సయ్య

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య కలిశారు. అసెంబ్లీ ప్రాంగణంలో ఆయన ముఖ్యమంత్రిని కలిశారు. రేవంత్ రెడ్డికి గుమ్మడి నర్సయ్య ఒక లేఖను అందజేశారు. ముఖ్యమంత్రిని కలవడానికి అవకాశం లభించడం లేదంటూ సుమారు పదిహేను రోజుల క్రితం గుమ్మడి నర్సయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిని కలవడానికి పలుమార్లు వెళ్లినప్పటికీ గేటు వద్దే ఆపేస్తున్నారని ఆయన వాపోయారు. ఎట్టకేలకు ముఖ్యమంత్రి అపాయింట్‌మెంట్ లభించడంతో ఈరోజు ఆయనను కలిశారు.

మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య మంగళవారం అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి పలు విషయాలను చర్చించారు. కొన్ని వారాల క్రితం రేవంత్ రెడ్డితో అపాయింట్‌మెంట్ పొందలేకపోవడం పట్ల నర్సయ్య బాధను వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే అయిన తననే సీఎం ఇంత దూరం పెడుతున్నారంటే.. ఇక సాధారణ ప్రజల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు.


Next Story