విద్యార్థులకు గుడ్ న్యూస్.. IELTS, TOEFL, GRE కోసం సిద్ధమవుతున్నారా.?

విదేశాలలో ఉన్నత విద్యను అభ్యసించాలని అనుకుంటున్న విద్యార్థులకు మద్దతుగా IELTS, TOEFL, GRE కోసం సిద్ధమవుతున్న మైనారిటీ అభ్యర్థులకు ఉచిత కోచింగ్ ప్రోగ్రామ్‌లను తెలంగాణ మైనారిటీస్ స్టడీ సర్కిల్ ప్రకటించింది.

By Medi Samrat  Published on  22 Nov 2024 10:30 AM IST
విద్యార్థులకు గుడ్ న్యూస్.. IELTS, TOEFL, GRE కోసం సిద్ధమవుతున్నారా.?

విదేశాలలో ఉన్నత విద్యను అభ్యసించాలని అనుకుంటున్న విద్యార్థులకు మద్దతుగా IELTS, TOEFL, GRE కోసం సిద్ధమవుతున్న మైనారిటీ అభ్యర్థులకు ఉచిత కోచింగ్ ప్రోగ్రామ్‌లను తెలంగాణ మైనారిటీస్ స్టడీ సర్కిల్ ప్రకటించింది. ముస్లింలు, సిక్కులు, క్రిస్టియన్లు, జైనులు, బౌద్ధులు, పార్సీలు సహా అర్హులైన మైనారిటీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి మహ్మద్ ఇలియాస్ అహ్మద్ ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు.

IELTS, TOEFL, GRE కోసం సిద్ధమవుతున్న ఆసక్తిగల అభ్యర్థులు తమ దరఖాస్తులను నవంబర్ 18 నుండి నవంబర్ 30 వరకు, సాయంత్రం 5 గంటలలోపు జామియా నిజామియా కాంప్లెక్స్, గన్ ఫౌండ్రీ, అబిడ్స్ 3వ అంతస్తులో ఉన్న తెలంగాణ మైనారిటీల స్టడీ సర్కిల్ కార్యాలయంలో దరఖాస్తులను సమర్పించవచ్చని తెలిపారు.

దరఖాస్తుదారులు తమ దరఖాస్తుతో పాటు క్రింది పత్రాలను సమర్పించాలి:

అన్ని విద్యా ధృవపత్రాల ఫోటోకాపీలు (SSC, ఇంటర్మీడియట్, డిగ్రీ).

ఆధార్ కార్డ్ ఫోటోకాపీ.

రెండు పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు.

మరింత సమాచారం కోసం, అభ్యర్థులు స్టడీ సర్కిల్‌ విభాగాన్ని 040-23236112 నెంబర్ కు కాల్ చేసి తెలుసుకోవచ్చు.

Next Story