348 యాప్స్ బ్యాన్ చేసిన కేంద్రం
Govt has blocked 348 apps for collecting, transmitting user info. ఏ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే.. ఏ యాప్ మన డేటాను తస్కరించకుండా ఉంటుందో
By Medi Samrat Published on 5 Aug 2022 7:08 PM ISTఏ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే.. ఏ యాప్ మన డేటాను తస్కరించకుండా ఉంటుందో అని తెలుసుకోవడం చాలా కష్టం. ఎన్నో దేశాలకు చెందిన యాప్స్ మన దేశ ప్రజల డేటాను కొట్టేసి.. ఇబ్బందులకు గురి చేస్తూ వస్తున్నాయి. అలాంటి యాప్స్ ను గుర్తించి బ్లాక్ చేస్తున్నాయి ప్రభుత్వాలు. తాజాగా 348 యాప్స్ బ్యాన్ చేసినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. విదేశాల్లోని సర్వర్స్‌కు యూజర్ల డేటాను పంపుతున్న 348 యాప్స్‌ను గుర్తించి, బ్యాన్ విధించామని కేంద్ర మంత్రి ప్రకటించారు. విదేశాలకు డేటా చేరితే భారత సమగ్రతకు, భద్రతకు ముప్పు వాటిల్లుతుందని అందుకే బ్యాన్ చేసినట్టు స్పష్టం చేశారు.
గత రెండేళ్ల కాలంలో భారత్‌లో దశల వారిగా కొన్ని మొబైల్ యాప్స్ బ్యాన్ చేస్తూ వచ్చారు. యాప్స్ బ్యాన్ గురించి కేంద్రం తాజాగా అధికారిక ప్రకటన చేసింది. పార్లమెంట్ వర్షకాల సమావేశాల్లో ఈ విషయంపై కేంద్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ వెల్లడించారు. దేశంలో ఇప్పటి వరకు 348 యాప్స్‌పై నిషేధం విధించినట్టు మంత్రి చంద్రశేఖర్ ప్రకటించారు. భారత యూజర్ల సమాచారాన్ని ఈ యాప్స్ సేకరించి.. వేరే దేశాల్లో ఉన్న సర్వర్‌లకు చేరవేస్తున్నట్టు గుర్తించామని, అందుకే బ్యాన్ చేసినట్టు వెల్లడించారు. ఏవైనా యాప్స్ ఇతర దేశాలకు యూజర్ల డేటాను అందిస్తున్నట్టు గుర్తించారా, ఎన్నింటిని బ్యాన్ చేశారని వచ్చిన ప్రశ్నకు మంత్రి అధికారికంగా స్పందించారు.
పెరుగుతున్న ఫిర్యాదుల మధ్య.. వినియోగదారుల సమాచారాన్ని సేకరించి, అనధికారిక పద్ధతిలో విదేశాలకు ప్రసారం చేస్తున్నారనే ఆరోపణలపై చైనాతో సహా వివిధ దేశాలు అభివృద్ధి చేసిన 348 యాప్‌లను ప్రభుత్వం బ్లాక్ చేసినట్లు తెలిపారు.