హరీష్ రావు, కేటీఆర్ ఎన్ని కుప్పి గంతులు వేసినా జూబ్లీహిల్స్ ప్రజలు పట్టించుకోరు: ఆది శ్రీనివాస్
టిమ్స్ హాస్పిటల్ ప్రారంభించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం జాప్యం చేస్తుందని హరీశ్ రావు కామెంట్స్‌పై ప్రభుత్వం విప్ ఆది శ్రీనివాస్ కౌంటర్ ఇచ్చారు.
By - Knakam Karthik |
హరీష్ రావు, కేటీఆర్ ఎన్ని కుప్పి గంతులు వేసినా జూబ్లీహిల్స్ ప్రజలు పట్టించుకోరు: ఆది శ్రీనివాస్
హైదరాబాద్: టిమ్స్ హాస్పిటల్ ప్రారంభించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం జాప్యం చేస్తుందని హరీశ్ రావు కామెంట్స్‌పై ప్రభుత్వం విప్ ఆది శ్రీనివాస్ కౌంటర్ ఇచ్చారు. ఈ మేరకు ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ..జూబ్లీహిల్స్ ఎన్నికలు వచ్చేసరికి హరీశ్ రావుకు సమస్యలు గుర్తుకు వచ్చాయి. నగర ప్రజలను పక్కదారి పట్టించడానికి ఆయన హడావిడి మొదలు పెట్టాడు. కొత్త పేట టిమ్స్ హాస్పిటల్ దగ్గర హరీష్ రావు, బీఆర్ఎస్ ఎమ్మెల్యే లు షో చేశారు. హాస్పిటల్ నిర్మాణం జరగడం లేదని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. పదేళ్లు అధికారంలో ఉండి ఎందుకు సూపర్ స్పెషాలిటీ ప్రభుత్వ ఆస్పత్రులను ఎందుకు నిర్మించలేదో హరీష్ రావు సమాధానం చెప్పాలి.. అధికారం పోవడానికి యేడాది ముందు టిమ్స్ హాస్పిటల్స్ కు టెండర్లు పిలిచారు.. మా ప్రభుత్వం వచ్చాక ముఖ్మమంత్రి వీటిని నిర్మాణంపైన ప్రత్యేక దృష్టి సారించారు.. అన్ని ఆస్పత్రుల నిర్మాణం దాదాపుగా 90 శాతం పూర్తైంది.. సూపర్ స్పెషాలిటి హాస్పిటల్ హంగులతో పాటు అత్యాధునిక వైద్య పరికరాలు, ఆధునిక ఆపరేషన్ థియేటర్లను నిర్మిస్తున్నాం..విదేశాల నుంచి వైద్య పరికరాలు రావాల్సి ఉండటం వల్ల ప్రారంభోత్సవానికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది..అని ఆది శ్రీనివాస్ అన్నారు.
రు కోసం ఆదరాబాదరాగా ఆస్పత్రులను ప్రారంభించాలనుకోవడం లేదు. పదేళ్లు అధికారంలో ఉండి ఉస్మానియా, గాంధీ ఆస్పత్రులను గాలికి వదిలేశారు. ఉస్మానియా ఆస్పత్రి వరదల్లో మునిగిపోయినా కనీసం పట్టించుకోలేదు. మా ముఖ్యమంత్రి గోషామహల్ అత్యాధునిక సౌకర్యాలతో ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కాంట్రాక్టు సంస్థ ఇప్పటికే నిర్మాణ పనులు మొదలు పెట్టింది..వరంగల్ లో ఎంజిఎం ఆస్పత్రి నిర్మాణ పనులను మా సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా పరిశీలించారు.. ఆస్పత్రిని కూడా త్వరలోనే ప్రారంభించుకుంటాం..రాజీవ్ ఆరోగ్య శ్రీ ని మొదలు పెట్టిందే కాంగ్రెస్ పార్టీ.. ముఖ్యమంత్రి సహాయ నిధి కింద కోట్లాది రూపాయలు పేదలకు ఇస్తున్నాం , ప్రభుత్వాస్పత్రులను పదేళ్ల పాటు గాలికి వదిలేసి ఇప్పుడు హరీష్ రావు మాకు పాఠాలు చెపుతున్నాడు. హరీష్ రావు,కేటీఆర్ ఎన్ని కుప్పి గంతులు వేసినా జూబ్లీహిల్స్ ప్రజలు పట్టించుకోరు..అని ఆది శ్రీనివాస్ విమర్శించారు.