గుడ్‌న్యూస్..ఇందిరమ్మ ఇండ్లు లబ్ధిదారుల రెండో జాబితాకు సిద్ధం
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకంపై దృష్టి పెట్టింది.
By Knakam Karthik
గుడ్‌న్యూస్..ఇందిరమ్మ ఇండ్లు లబ్ధిదారుల రెండో జాబితాకు సిద్ధం
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకంపై దృష్టి పెట్టింది. రాష్ట్రంలో అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసేలా రేవంత్ సర్కార్ దృష్టిసారించింది. ఈ క్రమంలో ఇప్పటికే గ్రామాల వారిగా లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించిన అధికారులు.. అర్హుల జాబితాను సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే తొలి విడతలో రాష్ట్ర వ్యాప్తంగా 72వేల మంది లబ్ధిదారులను ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం రెండో విడత లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేస్తోంది. ఈ జాబితాను ఈ నెలాఖరులోగా ప్రకటించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.
ఇందిరమ్మ ఇండ్ల పథకంలో రెండో విడతలో లబ్ధిదారుల ఎంపికపై అధికార యంత్రాంగం దృష్టిసారించింది. నియోజకవర్గానికి 3,500 ఇండ్లు మంజూరు చేస్తామని ప్రభుత్వం చెప్పిన విషయం తెలిసిందే. ఈ మేరకు ప్రతీ గ్రామంలో లబ్ధిదారుల ఎంపిక ఉండేలా జాబితా రూపకల్పనలో అధికారులు నిమగ్నమయ్యారు. లబ్ధిదారుల జాబితా ఎంపికలో ఎమ్మెల్యేల సూచనలను అధికారులు పరిగణలోకి తీసుకుంటున్నారు. రెండు విడుతల్లో కలిపి మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా 4.50 లక్షల మంది లబ్ధిదారులతో జాబితా రూపొందించి ఈ నెలాఖరులోగా లబ్ధిదారులను ప్రకటించటానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జూన్‌లోగా తొలి విడత డబ్బులు విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.